Search

చైనా లోని జెంగ్జౌ లో ముగిసిన 14వ ఎస్సిఓ సభ్య దేశాల ప్రధాన మంత్రుల సమావేశం

షాంఘై సహకార సంస్థ రెండు రోజుల షాంఘై సహకార సంస్థ (సీఎస్ఓ) సభ్య దేశాల ప్రధాన మంత్రుల కౌన్సిల్ సమావేశం 15 డిసెంబర్ 2015 న ముగిసింది.

Dec 21, 2015 11:40 IST
facebook IconTwitter IconWhatsapp Icon

షాంఘై సహకార సంస్థ రెండు రోజుల షాంఘై సహకార సంస్థ (సీఎస్ఓ) సభ్య దేశాల ప్రధాన మంత్రుల కౌన్సిల్ సమావేశం 15 డిసెంబర్ 2015 న ముగిసింది. ఈ సమావేశం తూర్పు-మధ్య చైనా లో హెనాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జెంగ్జౌ లో జరిగింది.

ఈ సమావేశానికి కజఖిస్తాన్ ప్రధాన మంత్రి కె మసిమొవ్, చైనీస్ ప్రీమియర్ లి కెకియాంగ్, కిర్గిజ్స్తాన్ ప్రధాన మంత్రి టి సరియేవ్, రష్యా ప్రధాన మంత్రి డిమిత్రి మెద్వెదేవ్, తజికిస్తాన్ ప్రధాన మంత్రి కె రసూల్జోడా మరియు ఉజ్బెకిస్తాన్ మొదటి డిప్యూటీ ప్రధాన మంత్రి ఆర్ అజిమోవ్ మరియు పరిశీలక దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

దీనిలో ప్రస్తుతం ఒక ఎస్సేన్డింగ్ దేశముగా ఉన్న భారతదేశం తరపున విదేశీ వ్యవహారాల సహాయమంత్రి జనరల్ వికె సింగ్ ప్రాతినిధ్యం వహించడం జరిగినది.

ఈ సమావేశంలో, ప్రతినిధులు అంతర్జాతీయ మరియు ప్రాంతీయ ఆర్థిక వృద్ధి సమస్యల గురించి విస్తృతముగా వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

వారు ఎస్సిఒ సభ్య దేశాల మధ్య పరస్పర అవగాహన మరియు సాంప్రదాయ స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆర్థిక మరియు మానవతా సహకారంతో అభివృద్ధి కోసం అవకాశాలు మరియు చర్యలను గురించి కూడా చర్చించారు.

ఈ సమావేశం ముగింపు సమయంలో, నాయకులు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చైనా యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను వివరించే ప్రాంతీయ ఆర్థిక సహకారం కోసం ఒక ఉమ్మడి ప్రకటనను జారీ చేసింది.

షాంఘై సహకార సంస్థ
• షాంఘై సహకార సంస్థ (ఎస్సిఒ) లేదా షాంఘై పాక్ట్ అనేది ఆరు దేశాలు, చైనా పీపుల్స్ రిపబ్లిక్, కజాఖ్స్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, రష్యా, తజికిస్తాన్, మరియు ఉజ్బెకిస్తాన్ లతో 15 జూన్ 2001 న షాంఘై లో స్థాపించబడిన ఒక అంతర ప్రభుత్వ సంస్థ.
• ఎస్సిఒ యొక్క ప్రధాన లక్ష్యాలు
i. సభ్య మధ్య సంబంధాలను బలోపేతం చేయడం
ii. రాజకీయ వ్యవహారాలు, ఆర్థిక మరియు వాణిజ్యము, శాస్త్ర - సాంకేతిక, సాంస్కృతిక, మరియు విద్యా రంగాల్లో సహకారం అలాగే శక్తి, రవాణా, పర్యాటకం, మరియు పర్యావరణ రక్షణ ప్రమోట్ చేయడం
iii. ప్రాంతీయ శాంతి, భద్రత మరియు స్థిరత్వం పరిరక్షించడానికి
iv. ఆసియా సాయంతో ప్రజాస్వామ్య, సమాన అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక క్రమాన్ని సృష్టించడం.
• జూలై 2015 లో, భారతదేశం మరియు పాకిస్తాన్ సంస్థ యొక్క పూర్తి సభ్య దేశాలుగా అనుమతించారు.
• ప్రస్తుతం నాలుగు పరిశీలక దేశాలు ఉన్నాయి. అవి: ఆఫ్గనిస్తాన్, బెలారస్, మంగోలియా మరియు ఇరాన్.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS