Search

15వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల ప్రదానం

15వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదాన కార్యక్రమం ఫ్లోరిడాలోని తంపా బేలో వైభవంగా జరిగింది.

Apr 30, 2014 08:00 IST
facebook IconTwitter IconWhatsapp Icon

15వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదాన కార్యక్రమం ఫ్లోరిడాలోని తంపా బేలో వైభవంగా జరిగింది. విజ్‌క్రాఫ్ట్ ఎంటర్‌టైన్‌మెంట్,ముంబై నిర్వహించిన ఈ కార్యక్రమం ఏప్రిల్ 23, 2014 నుంచి ఏప్రిల్ 26, 2014 వరకు నాలుగు రోజుల పాటు జరిగింది. ఈ ఐఫా అవార్డుల కార్యక్రమం అమెరికాలో జరగడం ఇదే తొలిసారి.

వివిధ కేటగిరీలలో ఐఫా అవార్డు గ్రహీతలు

• ఉత్తమ చిత్రం – భాగ్ మిల్ఖా భాగ్
• ఉత్తమ దర్శకుడు– రాకేశ్ ఓంప్రకాష్ మెహ్రా – (భాగ్ మిల్ఖా భాగ్)
• ఉత్తమ నటుడు - ఫర్హాన్ అక్తర్ (భాగ్ మిల్ఖా భాగ్)
• ఉత్తమ నటి - దీపికా పదుకొనే (చెన్నై ఎక్స్‌ప్రెస్)
• ఉత్తమ సహాయ నటుడు – ఆదిత్య రాయ్ కపూర్- (యే జవానీ హే దివానీ)
• ఉత్తమ సహాయ నటి – దివ్యా దత్తా- (భాగ్ మిల్ఖా భాగ్)
• ఉత్తమ నటుడు (కామెడీ పాత్ర) – అర్షద్ వార్సి- (జాలీ ఎల్.ఎల్.బీ)
• ఉత్తమ విలన్ - రిషి కపూర్ (డీ-డే)
• ఉత్తమ సంగీత దర్శకుడు – మిథున్, అంకిత్ తివారి, జీత్ గంగూలీ – (ఆషికి 2)
• ఉత్తమ కథా రచయిత –ప్రసూన్ జోషి (భాగ్ మిల్ఖా భాగ్)
• ఉత్తమ గేయ రచయిత –మిథున్ (తుమ్ హి హో - ఆషికి 2)
• ఉత్తమ నేపథ్య గాయకుడు అర్జిత్ సింగ్ (తుమ్ హి హో - ఆషికి 2)
• ఉత్తమ నేపథ్య గాయని –శ్రేయా ఘోషల్ (సున్ రహా హే- ఆషికి 2)
• ఉత్తమ తొలిచిత్ర నటుడు – ధనుష్ (రాంఝానా)
• ఉత్తమ తొలిచిత్ర నటి – వాణి కపూర్ (షుద్ దేసి రొమాన్స్)
• అమెరికాలో భారతీయుని ఔట్‌స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌– డాక్టర్ కిరణ్ & పల్లవి పటేల్
• ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్- దీపిక పదుకొనే
• జీవితసాఫల్య పురస్కారం – శతృఘ్నసిన్హా
• ఔట్‌స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌ టు ఇంటర్నేషనల్ సినిమా- జాన్ ట్రవోల్టా (ప్రసిద్ధ హాలీవుడ్ నటుడు)

ఐఫా అవార్డులను ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తుంది. ఈ అవార్డులను బాలీవుడ్ లోని ఆర్టిస్టులు మరియు సాంకేతిక నిపుణుల కృషికి గుర్తింపుగా అందజేస్తారు. 2013 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డులు కార్యక్రమం జూన్ 6, 2013వ తేదిన మకావ్ (చైనా)లో జరిగింది.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS