Search

ఆసియన్ కాంటినెంటల్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అధిబన్‌కు రజత పతకం

ఆసియన్ కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ భాస్కరన్ అధిబన్ ఏప్రిల్ 26, 2014న రజత పతకం సాధించాడు.

Apr 30, 2014 08:54 IST
facebook IconTwitter IconWhatsapp Icon

13వ ఆసియన్ కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ భాస్కరన్ అధిబన్ ఏప్రిల్ 26, 2014న రజత పతకం సాధించాడు.ఈ విజయంతో అధిబన్, 2015లో అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగే ప్రపంచ చెస్ కప్‌కూ అర్హత సాధించాడు. షార్జాలో జరిగిన ఈ టోర్నీలో చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో యు యాంగ్యీ (చైనా)తో తలపడిన అధిబన్ 33వ ఎత్తు వద్ద మ్యాచ్ ను డ్రా చేసుకున్నాడు.

ఈ చెస్ చాంపియన్‌షిప్‌లో ఏడు పాయింట్లతో యు యాంగ్యి (చైనా) స్వర్ణ పతకం సాధించగా, 6.5 పాయింట్లతో అధిబన్ రెండో స్థానంలో నిలిచి రజత పతాకాన్ని గెలిచాడు. మరో చైనా ఆటగాడు ని హువా 6.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు.భారత్ నుంచి ఎస్‌పీ సేతురామన్, పరిమార్జన్ నేగి వరుసగా తొమ్మిది, పదో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు 4.5 పాయింట్లతో 36వ ర్యాంక్‌ను పొందాడు.

మహిళల ఛాంపియన్‌షిప్‌లో ఇండోనేసియాకు చెందిన ఇరిన్ ఖరిష్మ సుకందర్ స్వర్ణ పతకాన్ని గెలవగా, ఇరాన్ చెస్ క్రీడాకారిణి అటౌసా పౌర్కషియాన్ రజత పతాకాన్ని గెల్చుకుంది. చైనాకు చెందిన టాన్ జొంగ్యి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకుంది.

13వ ఆసియన్ కాంటినెంటల్ చెస్ ఛాంపియన్‌షిప్‌ మరియు విమెన్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఏప్రిల్ 16, 2014 నుండి ఏప్రిల్ 26, 2014 వరకు షార్జాలో (యూఏఈ) జరిగాయి. ఈ పోటీలలో మొదటి ఐదు స్థానాలలో నిలిచిన చెస్ ఆటగాళ్ళు, 2015లో జరిగే ప్రపంచ కప్ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధిస్తారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS