Search

గుజరాత్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఆనందీబెన్ పటేల్

గుజరాత్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత ఆనందీబెన్ పటేల్ (73) మే 22,2014న ప్రమాణ స్వీకారం చేశారు.

May 24, 2014 16:01 IST
facebook IconTwitter IconWhatsapp Icon

గుజరాత్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత ఆనందీబెన్ పటేల్ (73) మే 22,2014న ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ కమలా బేణివాల్ ఆమెతో ప్రమాణం చేయించారు.

అంతకుముందు ఆనందీబెన్ పటేల్, గుజరాత్‌ బిజెపి శాసనసభ పక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి నరేంద్రమోడి మే 21, 2014న రాజీనామా చేసిన తరవాత ఆమెను బిజెపి ఎమ్మెల్యేలు తమ నేతగా ఎన్నుకున్నారు. ఆమె ఇప్పటివరకు గుజరాత్‌ రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

ఆనందీబెన్ మఫత్ భాయి పటేల్

ఆమె 1968 నుండి 30 సంవత్సరాల పాటు అహ్మదాబాద్ లోని మొనిబా విద్యాలయలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించిన ఆనందీబెన్‌ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 1994 నుంచి ఎమ్మెల్యేగా ఎంపికవుతూ వచ్చారు.
 
గుజరాత్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏకైక మహిళా నేతగా ఆనంద్‌బెన్‌ పటేల్ గుర్తింపు పొందారు.
 
• వృత్తిలో నిబద్ధతతో ఖచ్చితమైన పరిపాలనాధికారిగా పేరున్న ఆనందీబెన్ పటేల్, నరేంద్ర మోడీ ప్రభుత్వ కాలంలో రెవెన్యూ, రోడ్లు మరియు భవనాల మంత్రిత్వశాఖ వంటి పోర్ట్ ఫోలియోలను నిర్వహించారు.
• ఆమె బీజింగ్ లో జరిగిన నాల్గవ ప్రపంచ మహిళల సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
• ఆమె 1998లో తన తొలి అసెంబ్లీ ఎన్నికలలో మండల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి కేషుభాయి పటేల్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
• ఆమె 1994లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS