Search

డిస్కం పునరుద్ధరణ పథకం ఉదయ్ లో చేరిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

5 డిసెంబర్ 2015 న ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన (ఉదయ్) లో చేరిన భారతదేశం యొక్క మొదటి రాష్ట్రంగా మారింది. ఈ పథకం రుణ ఒత్తిడిలలో ఉన్న విద్యుత్ సరఫరా కంపెనీలను చైతన్యపరచే లక్ష్యంతో ఉంది.

Dec 8, 2015 16:05 IST
facebook IconTwitter IconWhatsapp Icon

5 డిసెంబర్ 2015 న ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన (ఉదయ్) లో చేరిన భారతదేశం యొక్క మొదటి రాష్ట్రంగా మారింది. ఈ పథకం రుణ ఒత్తిడిలలో ఉన్న విద్యుత్ సరఫరా కంపెనీలను చైతన్యపరచే లక్ష్యంతో ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఉదయ్ లో చేరడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖకు సూత్రప్రాయంగా ఆమోదం ఇచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఈ పథకంలో చేరింది.

ఉదయ్ పథకం, వడ్డీ భారం, విద్యుత్ ఖర్చు, మరియు సాంకేతిక మరియు వాణిజ్య నష్టాలను తగ్గించడంలోసహకరిస్తుంది. తత్ఫలితంగా, సరఫరా కంపెనీలు 24x7 విద్యుత్ సరఫరాలకు తోడ్పడేలా తగినంత మరియు నమ్మకమైన శక్తి సరఫరా కోసం స్థిరమైనదిగా మారతాయి.

ఈ పథకం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర డిస్కం, మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందంఫై సంతకం చేయడం ద్వారా అమలులోకి వస్తుంది.

ఉదయ్ పథకంలో చేరనున్న ఇతర రాష్ట్రాలు - జార్ఖండ్ (రెండవ రాష్ట్రం), మరియు రాజస్థాన్ (మూడవ రాష్ట్రం) ఉన్నాయి.

ఉదయ్ పథకంలోని ముఖ్యాంశాలు

• రాష్ట్ర ప్రభుత్వాలు 30 సెప్టెంబర్ 2015 నుండి రెండు సంవత్సరాల వరకు 75 శాతం డిస్కం రుణం తీసుకోవచ్చు.

• కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఉదయ్ ద్వారా తీసుకున్న రుణంలో మరియు 2015-16 మరియు 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో ఆయా రాష్ట్రాల ద్రవ్యలోటు లెక్కించడంలో ఎటువంటి జోక్యం కలిగి ఉండదు.

• రాష్ట్రాలు, మార్కెట్ లో లేదా నేరుగా తగిన మేరకు డిస్కం రుణ తీసుకున్న సంబంధిత ఆర్ధిక సంస్థలకు ఎస్డిఎల్ బాండ్లతో సహా నాన్ ఎస్ఎల్ఆర్ లను జారీ చేస్తుంది.

• రాష్ట్రాలు ఒక శ్రేణీకృత పద్ధతిలో భవిష్యత్తు డిస్కం రుణాలను తీసుకుంటుంది.

• రాష్ట్రాలు ఉదయ్ పథకాలను అంగీకరించడం మరియు కార్యాచరణ ప్రకారం నిర్వహించడం, విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు నవ్య మరియు పునరుత్పాదక శక్తి యొక్క మంత్రిత్వ శాఖ యొక్క పథకాలు ద్వారా అదనపు / ప్రాధాన్యత నిధులు ఇవ్వబడుతుంది.

• రాష్ట్రాలు కార్యాచరణ ప్రకారం నిర్వహించలేకపోతే ఐపిడిఎస్ మరియు డిడియూజిజేవై నిధులను వదులుకోవాల్సి ఉంటుంది.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App


Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS