Search

రాష్ట్ర అభివృద్ధి కోసం జపాన్ తో రెండు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 22 అక్టోబ‌ర్ 2015న ఆర్ధిక మౌలిక వ‌స‌తుల అభివృద్ధి కోసం ఎంవోసీ, అమ‌రావ‌తి అభివృద్ధి కోసం జ‌పాన్ ప్ర‌భుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఒక‌ప‌క్క అమ‌రావ‌తి నిర్మాణానికి శంకుస్ధాప‌న జ‌రుగుతున్న వేళ మ‌రోవైపు ఈ ఒప్పందాలు జ‌రిగాయి.

Oct 28, 2015 12:12 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 22 అక్టోబ‌ర్ 2015న ఆర్ధిక మౌలిక వ‌స‌తుల అభివృద్ధి కోసం ఎంవోసీ, అమ‌రావ‌తి అభివృద్ధి కోసం జ‌పాన్ ప్ర‌భుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది.

ఒక‌ప‌క్క అమ‌రావ‌తి నిర్మాణానికి శంకుస్ధాప‌న జ‌రుగుతున్న వేళ మ‌రోవైపు ఈ ఒప్పందాలు జ‌రిగాయి.

ఏపీ జ‌పాన్ మ‌ధ్య స‌హ‌కారానికి అవ‌గాహ‌న (ఎంవోసీ)
• దీనిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మ‌రియు జ‌పాన్ ఆర్ధిక‌, వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి (మేటి) యూసుక త‌కాగి సంత‌కాలు చేశారు.
• వివిధ విధానాల ద్వారా ఈ ప్రాంతంలో ప్రాథ‌మికంగా పారిశ్రామిక అభివృద్ధికి స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.

ఈ ల‌క్ష్య సాధ‌న కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పెట్టుబడుల కోసం జ‌పాన్ లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేస్తుంది.
* ప‌రిశ్ర‌మ‌లు, పోర్టులు మ‌రియు విద్యుత్ కేంద్రాలు, సాంకేతిక‌రంగం,  వ్య‌వ‌సాయ‌రంగంపై దృష్టిని కేంద్రీక‌రిస్తాయి.

ఏపీ-జ‌పాన్ మోమోరాండం ఆఫ్ అండ‌ర్ స్టాండింగ్ (ఎంవోయూ)
• ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అండ్ జ‌పాన్ బ్యాంక్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ కో ఆప‌రేష‌న్ (జెబిఐసి) లు సంత‌కాలు చేశాయి.
• విదేశీ పెట్టుబ‌డులు మ‌రియు రాష్ట్ర నూత‌న రాజ‌ధాని సమీప ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెడ‌తాయి.

అమ‌రావ‌తితో జ‌పాన్ కున్న అనుబంధం
ప్రాచీన అమ‌రావ‌తి కి, రాజ‌ధానిగా రూపాంతరం చెందుతున్న అమ‌రావ‌తికి,  జ‌పాన్ కు మ‌ధ్య ఎంతో సాంస్కృతిక అనుబంధం ఉంది.
జ‌సాన్ లో 34 శాతం మంది ప్ర‌జ‌లు బుద్ధిజంలోని వ‌జ్ర‌యానాన్ని అనుస‌రిస్తారు.దీనిని ఆచార్య నాగార్జునుడు 150 ఏడి మ‌రియు 250 ఏడి మ‌ధ్య‌కాలంలో ఆచ‌రించాడు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS