Search

ఫోర్బ్స్ మ్యాగజిన్ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఏంజెలా మెర్కెల్‌కు అగ్రస్థానం

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఫోర్బ్స్ మ్యాగజిన్ విడుదల చేసే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో అగ్రస్థానం పొందారు.

May 31, 2014 11:06 IST
facebook IconTwitter IconWhatsapp Icon

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఫోర్బ్స్ మ్యాగజిన్ విడుదల చేసే అత్యంత శక్తిమంతమైన మహిళల వార్షిక జాబితా- 2014లో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళగా అగ్రస్థానం పొందారు. ఫోర్బ్స్ మ్యాగజిన్ ఈ వార్షిక జాబితాను మే 28, 2014న విడుదల చేసింది. ఏంజెలా మెర్కెల్ వరుసగా నాలుగోసంవత్సరం ఈ జాబితాలో అగ్రస్థానం పొంది మొత్తంగా తొమ్మిదిసార్లు దీనిలో స్థానం దక్కించుకున్నారు.
 
ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ఐదుగురు మహిళలు స్థానం దక్కించుకోగా, వారిలో పెప్సికో చీఫ్ ఇంద్రా నూయి 13వ స్థానంలో నిలవగా, సిస్కో కంపెనీ ప్రధాన టెక్నాలజీ మరియు స్ట్రాటజీ అధికారి పద్మశ్రీ వారియర్ 71వ ర్యాంకును దక్కించుకున్నారు.

ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ మ్యాగజిన్ జాబితాలో స్థానం పొందిన ఇతర భారతీయ మహిళలు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య (36వ ర్యాంక్) ఐసిఐసిఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్ (43వ ర్యాంక్) మరియు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా (92వ ర్యాంక్).

అత్యంత శక్తిమంతమైన తొలి పది మహిళల జాబితా 

ర్యాంక్

పేరు

హోదా

1

ఏంజెలా మెర్కెల్

జర్మనీ ఛాన్సలర్  

 

2

జానెట్ ఎల్లెన్

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఛైర్మన్

3

మెలిండా గేట్స్

బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో ఛైర్మన్

4

దిల్మా రౌసెఫ్              

బ్రెజిల్ అధ్యక్షురాలు

5

క్రిస్టిన్ లగార్డే

ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్

6

హిల్లరీ రోధం క్లింటన్

మాజీ అమెరికా విదేశాంగ కార్యదర్శి

7

మేరీ బార్ర

జనరల్ మోటర్స్ సీఈఓ

8

మిషెల్ ఒబామా

అమెరికా ప్రథమ మహిళ

9

షెరిల్ సాండ్ బెర్గ్

ఫేస్‌బుక్ సీఓఓ

10

వర్జీనియా రోమెట్టి

ఐబీఎమ్ సీఈఓ

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS