Search

రోమ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పీపుల్స్ చాయిస్ అవార్డు గెల్చిన యాంగ్రీ ఇండియన్ గాడెసెస్

పాన్ నలిన్ దర్శకత్వం వహించిన యాంగ్రీ ఇండియన్ గాడెసిస్ సినిమాకు 2015 అక్టోబర్ 25 న ఇటలీలోని రోమ్ లో  జరిగిన 10 వ రోమ్ చలన చిత్రోత్సవంలో బిఎన్ఎల్ పీపుల్స్ చాయిస్ అవార్డు లభించింది.

Oct 29, 2015 15:04 IST
facebook IconTwitter IconWhatsapp Icon

పాన్ నలిన్ దర్శకత్వం వహించిన యాంగ్రీ ఇండియన్ గాడెసిస్ సినిమాకు 2015 అక్టోబర్ 25 న ఇటలీలోని రోమ్ లో జరిగిన 10 వ రోమ్ చలన చిత్రోత్సవంలో బిఎన్ఎల్ పీపుల్స్ చాయిస్ అవార్డు లభించింది.

బిఎన్ ఎల్ గ్రూప్ బిఎన్ పి పరిభాస్ ఈ అవార్డును ప్రధానం చేయగా, ఈ విజేతను ప్రేక్షకుల  ఆన్ లైన్ ఓటింగ్ విధానం ద్వారా  ఎంపిక చేశారు. చలన చిత్రోత్సవంలో  ఈ సినమాను అభినందిస్తూ సభికులు 8 నిమిషాల పాటు లేచి నిల్చుని హర్షధ్వానాలు చేశారు. గతంలోనూ 2015 టొరొంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ఈ చిత్రం స్పెషల్ ప్రెజెంటేషన్ క్రింద ఎంపకైంది. రోమ్ లో జరిగిన లెనీ అబ్రహం సన్స్ రూమ్ లోనూ  పీపుల్స్ చాయిస్ అవార్డు ఓటింగ్  లో రెండోస్థానం పొందింది.యాంగ్రీ ఇండియన్ గాడెసెస్  అనేది  2015 హిందీ డ్రామా ఆధారంగా రూపొందిన చిత్రం. సంధ్యా మృదుల్., తనిష్ట చటర్జీ., సారా జేన్ డయాస్, అనుష్క మంచందా, అమృత్ మగ్ హేర్., రాజశ్రీ దేశ్  పాండే  మరియు పావ్ లీనా గుజ్రాల్., అదిల్ హుస్సేన్ ఈ చిత్రంలో తారాగణం.

ఒక అమ్మాయి తన స్నేహితురాళ్లను గోవాకు పిలిచి, తన పెళ్లి విషయాన్ని ప్రకటించాలనుకోవడం, ఆతర్వాత అదే సందర్భం, ఒక బ్యాచిలర్ పార్టీగా మారడం ఈ సినిమా యొక్క ప్రధాన ఇతివృత్తం.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS