1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. ఏప్రిల్ 2014 కరెంట్ అఫైర్స్

ఏప్రిల్ 2014 కరెంట్ అఫైర్స్

2014 బోస్టన్ మారథాన్ విజేత మెబ్ కెఫ్లెజిఘి

Apr 22, 2014
అమెరికా అథ్లెట్ మెబ్ కెఫ్లెజిఘి ఏప్రిల్ 21, 2014న జరిగిన బోస్టన్ మారథాన్ విజేతగా నిలిచాడు.

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నూతన డెరైక్టర్‌గా అనిరుధ్ కుమార్

Apr 22, 2014
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ నూతన డెరైక్టర్ (రైల్ అండ్ మెట్రో)గా అనిరుధ్ కుమార్ ఏప్రిల్ 21, 2014న బాధ్యతలు చేపట్టారు.

రిజర్వ్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి గోపాలకృష్ణ స్వచ్ఛంద పదవీ విరమణ

Apr 22, 2014
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి గోపాలకృష్ణ ఏప్రిల్ 20,2014న స్వచ్ఛంద పదవీ విరమణ చేసారు.

భారత హాకీ పురుషుల జూనియర్ జట్టు కోచ్‌గా హరేంద్ర సింగ్‌

Apr 22, 2014
భారత హాకీ పురుషుల జూనియర్ జట్టు కోచ్‌గా హరేంద్ర సింగ్‌ను హకీ ఇండియా (హెచ్‌ఐ) ఏప్రిల్ 21,2014న నియమించింది.

2014-ఎంఎస్ సుబ్బలక్ష్మి స్మారక అవార్డుకు మాతంగి సత్యమూర్తి ఎంపిక

Apr 21, 2014
ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు మాతంగి సత్యమూర్తి 2014సంవత్సరానికి గాను ఎంఎస్ సుబ్బలక్ష్మి స్మారక అవార్డుకు ఎంపికయ్యారు.

రిచ్‌మండ్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ విజేత జోష్నా చినప్ప

Apr 21, 2014
భారత క్రీడాకారిణి జోష్నా చినప్ప ఏప్రిల్ 20, 2014న రిచ్‌మండ్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

పాల్కొహాల్ - పొడి రూపంలోని ఆల్కహాల్ కు అమెరికా ప్రభుత్వ ఆమోదం

Apr 21, 2014
పొడిరూపంలో ఉండే ఆల్కహాల్ – పాల్కొహాల్ వినియోగాన్ని సమర్దిస్తూ ఏప్రిల్ 20, 2014న అమెరికా ప్రభుత్వం తన ఆమోదాన్ని తెలిపింది.

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి ప్రమాణ స్వీకారం

Apr 21, 2014
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి ఏప్రిల్ 21, 2014న ప్రమాణ స్వీకారం చేశారు.

మోంటెకార్లో మాస్టర్స్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్ టైటిల్ విజేత స్టానిస్లాస్ వావ్రింకా

Apr 21, 2014
స్విట్జర్లాండ్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రింకా ఏప్రిల్ 20,2014న మోంటెకార్లో మాస్టర్స్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.

ఫోల్డ్‌స్కోప్: అత్యంత చౌక మైక్రోస్కోప్ రూపకల్పన

Apr 21, 2014
డాలరు కన్నా తక్కువ ఖరీదు చేసే మైక్రోస్కోప్ ను స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బృందం రూపొందించారు.

ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రాం-2014ను ప్రారంభించిన భారత ఎన్నికల సంఘం

Apr 21, 2014
భారత ఎన్నికల సంఘం ఏప్రిల్ 15, 2014న ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రాం-2014ను ప్రారంభించింది

అంతరిక్షంలో మానవ రోగనిరోధక కణాలపై పరిశోధన

Apr 21, 2014
యూనివర్సిటీ ఆఫ్ జురిచ్ శాస్త్రవేత్తలు ఏప్రిల్ 18,2014న మానవ శరీరంలోని రోగనిరోధక కణాలను, రోదసిలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపారు.

2014-చైనీస్‌ గ్రాండ్‌ ప్రీ ఫార్ములా వన్ విజేత లూయిస్ హామిల్టన్

Apr 21, 2014
మెర్సిడిజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ 2014-చైనీస్‌ గ్రాండ్‌ప్రీ ఫార్ములా వన్ రేస్‌లో విజేతగా నిలిచాడు.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై బిసిసిఐ త్రిసభ్య కమిటీ

Apr 21, 2014
ఐపిఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించాలని బిసిసిఐ పాలక మండలి ఏప్రిల్ 20,2014న నిర్ణయించింది.

ఇండో-అమెరికన్‌ రాజేంద్ర సింగ్‌కు సోలార్‌ ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ పురస్కారం

Apr 21, 2014
ఇండో-అమెరికన్‌ రాజేంద్ర సింగ్‌ను 'సోలార్‌ ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌' పురస్కారానికి అమెరికా ప్రభుత్వం ఎంపిక చేసింది.

హిల్లరీ క్లింటన్ నూతన పుస్తకం-హార్డ్ చాయిసెస్, జూన్ 2014లో విడుదల

Apr 20, 2014
హిల్లరీ క్లింటన్ రచించిన హార్డ్ చాయిసెస్ అనే పుస్తకాన్ని జూన్ 2014లో విడుదల చేయనున్నట్లు పుస్తక ప్రచురణ సంస్థ, సైమన్ అండ్ షస్టర్ ప్రకటించింది.

ఏప్రిల్ 18, ప్రపంచ వారసత్వ దినోత్సవం

Apr 19, 2014
ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏప్రిల్ 18, 2014 విశ్వవ్యాప్తంగా జరుపుకున్నారు.

ఐపీఎల్-7 డోపింగ్ నిరోధక అధికారిగా చంద్రన్

Apr 19, 2014
ఇండియన్ ప్రీమియర్ లీగ్-7 తొలి దశలో డోపింగ్ నిరోధక అధికారిగా పీఎస్‌ఎమ్ చంద్రన్ ఏప్రిల్ 17, 2014న నియమితులయ్యారు.

అల్జీరియా అధ్యక్షుడిగా వరుసగా నాలుగోసారి ఎన్నికైన అబ్దెల్అజీజ్

Apr 19, 2014
అల్జీరియా అధ్యక్ష ఎన్నికల్లో అబ్దెల్అజీజ్ బౌటేఫ్లిక ఏప్రిల్ 18, 2014న వరుసగా నాలుగోసారి విజయం సాధించారు

ఉక్రెయిన్‌ సంక్షోభంపై కుదిరిన జెనీవా ఒప్పందం

Apr 19, 2014
ఉక్రెయిన్‌ సంక్షోభంపై ఏప్రిల్ 17,2014న జెనీవాలో జరిగిన నాలుగు దేశాల చర్చల ఫలితంగా ఒక ఒప్పందం కుదిరింది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...