Search

అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియన్ గోమెజ్ మృతి

అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియన్ గోమెజ్ 24 మే 2015 న మ్యాచ్ మధ్యలో మరణించాడు. అట్లిటికో పారణ జట్టు సభ్యడైన 27ఏళ్ల గోమెజ్ బొకా యునిడోస్ తో జరిగిన రెండవ స్థాయి ఆట సమయంలో పిచ్ పై కుప్పకూలిపోయాడు.

May 27, 2015 12:24 IST
facebook IconTwitter IconWhatsapp Icon

అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియన్ గోమెజ్ 24 మే 2015 న మ్యాచ్ మధ్యలో మరణించాడు. అట్లిటికో పారణ జట్టు సభ్యడైన 27ఏళ్ల గోమెజ్ బొకా యునిడోస్ తో జరిగిన రెండవ స్థాయి ఆట సమయంలో పిచ్ పై కుప్పకూలిపోయాడు.

అలా కుప్పకూలిన వెంటనే, ఆ డిఫెండర్ ను కోర్రియంటిస్ పట్టణంలో ఆస్పత్రికి చేర్చినప్పటికీ వైద్యులు అతనిని కాపాడలేక పోయారు.

గోమెజ్ యొక్క మరణంతో అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ (AFA), షెడ్యూల్ చేయబడిన ఇతర గేమ్స్ ను రద్దుచేసింది.

 గోమెజ్, మే 14 2015న  తలకు ప్రాణాంతకమైన గాయం కావడంతో మృతిచెందిన శాన్ మార్టిన్ డి బుర్జాకో జట్టుకు చెందిన ఇమాన్యుల్ ఒర్టెగా తరువాత మే 2015 లో చనిపోయిన రెండవ అర్జెంటీనా ఆటగాడయ్యారు.

 ఒర్టెగా పిచ్ చుట్టూ వుండే కాంక్రీటు గోడపై పడిపోవడంతో తలపై తగిలిన గాయాలతో పోరాడుతూ 11 రోజులపాటు ఇంటెన్సివ్ కేర్ లో గడిపిన తరువాత మరణించాడు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS