Search

పర్యావరణ అనుకూల ఫిఫా ప్రపంచ కప్ నిర్వహణకు చర్యలు చేపట్టనున్న బ్రెజిల్

పర్యావరణ అనుకూల ఫిఫా ప్రపంచకప్ 2014 నిర్వహణకు అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు బ్రెజిల్ మే 27, 2014న ప్రకటించింది.

May 30, 2014 17:07 IST
facebook IconTwitter IconWhatsapp Icon

పర్యావరణ అనుకూల ఫిఫా ప్రపంచకప్ 2014 నిర్వహణకు అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు బ్రెజిల్ మే 27, 2014న ప్రకటించింది. ఇందుకోసం కాలుష్యాన్ని నిరోధించే పలు ఉద్గారాల ట్రేడింగ్ పథకం మరియు గ్రీన్ పాస్‌పోర్టు స్మార్ట్-ఫోన్ అప్లికేషన్ వంటి చర్యలను తీసుకోనుంది.

బ్రెజిల్ లో జూన్ 12 నుంచి జూలై 13, 2014 వరకు జరిగే ఈ ప్రపంచ కప్ లో కార్బన ఉద్గారాల విస్తృతి 1.4 మిలియన్ టన్నులకు చేరుతుందని ఒక అంచనా. ఈ సమయంలో పర్యావరణ పరిరక్షణ కోసం బ్రెజిల్ కొన్ని పర్యావరణ అనుకూల చర్యలను తీసుకుంది.

పర్యావరణ అనుకూల చర్యలు

• ఆతిధ్యం అందించే అన్ని స్టేడియంలు పేరుపొందిన లీడర్ షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ (ఎల్ఈఈడి) సర్టిఫికేషన్ ముద్ర ఆమోదంను పొందనున్నాయి.
• ఫుట్ బాల్ అభిమానులు పర్యావరణానికి చేయూతగా ఉండే స్థిర పర్యాటక పద్ధతులను పాటించడం కోసం బ్రెజిల్ మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపి) గ్రీన్ పాస్‌పోర్టు అనే ఒక సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించింది.
• చెత్తను ఏరే వ్యక్తులకు వ్యర్ధాల రీసైక్లింగ్ లో శిక్షణ ఇవ్వడం మరియు స్థానికంగా లభ్యమయ్యే సేంద్రియ తినుబండారాలను స్టాళ్ళ ద్వారా అమ్మడానికి చర్యలు చేపట్టడం.

ప్రధాన క్రీడా ఈవెంట్లు మరియు ప్రపంచ కప్ పోటీల నిర్వహణ వల్ల అధికస్థాయిలో కార్బన్ ఫూట్ ప్రింట్లు నమోదు అవుతాయి. స్టేడియంల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన మరియు ఆటగాళ్ళు, అభిమానుల రవాణా వల్ల అధిక స్థాయిలో భుతాపాన్ని పెంచే అన్ని వాయువులతో పాటు కార్బన్ డైఆక్సైడ్ (బొగ్గుపులుసు)వాయువు స్థాయిలు పెరుగుతాయి.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS