Search

1930 త తర్వాత దీర్ఘకాలిక మాంద్యంలోకి ప్రవేశించిన బ్రెజిల్

బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్థ 2015 ఏప్రిల్ -జూన్ కాలంతో పోలిస్తే జులై- సెప్టెంబర్ 2015 సమయంలో 1.7 శాతం క్షీణించింది.ఈ విషయాన్ని 1 డిసెంబర్ 2015 న ప్రభుత్వం ప్రకటించింది.

Dec 4, 2015 12:03 IST
facebook IconTwitter IconWhatsapp Icon

బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్థ 2015 ఏప్రిల్ -జూన్ కాలంతో పోలిస్తే జులై- సెప్టెంబర్ 2015 సమయంలో 1.7 శాతం క్షీణించింది.ఈ విషయాన్ని 1 డిసెంబర్ 2015 న ప్రభుత్వం ప్రకటించింది.

ఇది బ్రెజిల్ కు వరుసగా మూడవసారి జనవరి 2015 నుంచి క్షీణ దశగా గుర్తించబడింది. 1930 తర్వాత బ్రెజిల్ దీర్ఘకాలిక మాంద్యంలోకి ప్రవేశించింది.

బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి కొన్ని వాస్తవాలు

• 12 సంవత్సరాల తర్వాత అక్టోబర్ 2015న ద్రవ్యోల్బణం 10 శాతం నమోదైంది.

• నిరుద్యోగం రేటు జూలై-సెప్టెంబర్ 2015న 8.9 శాతానికి పెరిగింది. 2014-15 న 6.8 శాతం నమోదైంది.

• తక్కువ సంపాదన, గృహ ఖర్చు జూలై- సెప్టెంబర్ 2015 సమయంలో 4.5 శాతం తగ్గింది.

• నిజానికి డాలర్ తో పోలిస్తే బ్రెజిల్ కరెన్సీ జనవరి-నవంబర్ 2015 మధ్య కాలంలో 31 శాతం తగ్గుదల నమోదుచేసుకుంది.

•బోవెస్పా, బ్రెజిల్ ప్రధాన స్టాక్ ఇండెక్స్  సెప్టెంబర్ 2014 నుంచి 27 శాతం దిగజారింది.

• విదేశీ మరియు దేశీయ పెట్టుబడులు బ్రెజిల్ లో వరుసగా తొమ్మిది  త్రైమాసికాల్లో దిగజారాయి.

బ్రెజిల్ లో ఎందుకు మాంద్యం ఏర్పడింది?

బ్రెజిల్ లో మాంద్యం ఏర్పడడానికి ముఖ్య కారణాలు అనేకం ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ మందకొడిగా ఉండడం, ఎగుమతుల్లో సంకోచం, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆయిల్ కంపెనీ పెట్రోబ్రాస్ లో అసాధారణ కుంభకోణం.

ఈ అంశాలన్నీ బ్రెజిల్ వ్యాపార వాతావరణంపై ప్రభావాన్ని చూపడంతో ఆర్ధిక వ్యవస్థ క్షీణించిపోతోంది.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

 

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS