Search

హీట్ ఆన్ పవర్ పేరుతో నివేదిక విడుదల చేసిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్

22 ఫిబ్రవరి 2015 న సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE), హీట్ ఆన్ పవర్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది.

Feb 24, 2015 12:02 IST
facebook IconTwitter IconWhatsapp Icon

22 ఫిబ్రవరి 2015 న సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE), హీట్ ఆన్ పవర్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక, భారతదేశంలోని బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, ప్రపంచంలోనే అత్యంత అసమర్థవంతమైనవిగా పేర్కొంది.

ఈ నివేదికను, భారతదేశం యొక్క హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్ విడుదల చేశారు. దీనిని CSE యొక్క గ్రీన్ రేటింగ్ ప్రాజెక్ట్ (GRP) కింద నిర్వహించిన రెండు సంవత్సరాల కాలం పరిశోధనాధ్యయనం తర్వాత విడుదల చేశారు.

 బొగ్గు రంగంపై  దాని పర్యావరణ పనితీరు మరియు సమ్మతి మదింపుపై జరిగిన ఈ అధ్యయనం భారతదేశంలో ఈ రకమైన అధ్యయనం మొదటిది. ఈ అధ్యయనాన్ని, బొగ్గు రంగం యొక్క పర్యావరణ పనితీరుపై ఒక స్పష్టమైన చిత్రాన్ని ఇవ్వాలనే లక్ష్యం తో నిర్వహించారు.

అధ్యయనం యొక్క తీర్పులు

• వనరుల అసమర్థ ఉపయోగం మరియు సాంకేతిక వెనకబాటుతనం, కాలుష్య స్థాయి పెరుగుదలకు ప్రధాన కారణాలు. దీనిని మెరుగు పరిచే అవకాశాలు చాల ఉన్నాయి.

 • పరిశ్రమలు 60-70 శాతం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయని, సామర్థ్య ఉపయోగం మెరుగుపరిస్తే, రంగంలో కొత్త ప్లాంట్లను నిర్మించకుండానే అదనపు శక్తిని ఉత్పత్తి చేయవచ్చని తెలిపింది.  

• ఢిల్లీలోగల బదర్-పూర్ ఎన్టిపిసి పరిశ్రమ అత్యంత కాలుష్యకారిణిగా గుర్తించబడింది.

• 20 పరిశ్రమల నదులు మరియు నిక్షేపాలతో ఒక విష హెవీ మెటల్ బూడిద ముద్ద కలుషితం చేస్తున్నట్లు తెలిపింది.

•  40 శాతం పరిశ్రమల ద్వారా విడుదలైన విసర్జన లో నిబంధనల ప్రకారం ఉండవలసిన ఘన పదార్ధం (TSS) ఉండడం లేదు.

 • 60 శాతం పరిశ్రమలలో మురికినీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయబడలేదు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS