Search

మహారాష్ట్ర స్కూల్ పుస్తకాలలో సచిన్ టెండూల్కర్ పై పాఠం

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం, తమ నాల్గవ తరగతి విద్యా పాఠ్యాంశాలలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పై ఒక పాఠాన్ని భాగం చేయాలని నిర్ణయించింది.

May 27, 2014 08:05 IST
facebook IconTwitter IconWhatsapp Icon

మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం, తమ నాల్గవ తరగతి విద్యా పాఠ్యాంశాలలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పై ఒక పాఠాన్ని  భాగం చేయాలని నిర్ణయించింది. ఈ పాఠంతో విద్యార్ధుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరాఠీ మరియు ఆంగ్ల పాఠ్యాంశాలలో సచిన్ పై ఈ పాఠాన్ని భాగం చేశారు.
 
2014-2015 విద్యాసంవత్సరంలో మహారాష్ట్రకు చెందిన నాల్గవ తరగతి విద్యార్ధులు భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ జీవితం నుంచి స్ఫూర్తి పొందడం కోసం ఈ పాఠ్యాంశాలను జోడించడం జరిగింది.

భారత క్రికెట్ ఆటగాడైన సచిన్ టెండూల్కర్, 24 సంవత్సరాల తన క్రీడాజీవితంలో ఎన్నో అవార్డులను పొంది, లెక్కకుమిక్కిలి రికార్డులను తన పేరున లిఖించాడు. సచిన్ నవంబర్ 16, 2013న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు, ఇదే రోజున ఆయన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపికయ్యారు. సచిన్ టెండూల్కర్ భారతదేశానికి అందించిన క్రికెట్ సేవలకు గుర్తింపుగా ఫిబ్రవరి 4, 2014న భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.
 
మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో క్రికెటర్ల పై పాఠాలను రూపొందించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా చంద్రకాంత్ గులబ్రో బోర్డే (చందూబోర్డే) మరియు సునీల్ గవాస్కర్ ల పై కూడా పాఠాలను రూపొందించారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS