Search

విద్యుచ్చక్తితో పనిచేసే మొదటి విమానం ఆర్ఎక్స్ 1ఈ ఉత్పత్తికి చైనా అనుమతి

చైనా దేశీయ కార్యకలాపాలకు తయారుచేసిన విద్యుత్ శక్తితో ఆర్ఎక్స్1 విమానం ఉత్పత్లికి చైనా విమానయాన పరిపాలన శాఖ 4 డిసెంబర్ 2015న అనుమతి మంజూరుచేసింది.

Dec 7, 2015 16:06 IST
facebook IconTwitter IconWhatsapp Icon

చైనా దేశీయ కార్యకలాపాలకు తయారుచేసిన విద్యుత్ శక్తితో ఆర్ఎక్స్1 విమానం ఉత్పత్లికి చైనా విమానయాన పరిపాలన శాఖ 4 డిసెంబర్ 2015న అనుమతి మంజూరుచేసింది.

ఆర్ఎక్స్1ఎలక్ట్రిక్ లైట్ స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ను షెన్యాంగ్ ఎయిరోస్పేస్ యూనివర్శిటీ అభివృద్ధి చేసింది. ఇది చైనాలోతయారైన మానవసహిత ఎలక్ట్రిక్ లైట్ స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్.

 ఆర్ఎక్స్1ఈ ఎలక్ట్రిక్ లైట్ స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రత్యేకతలు

• ఈ విమానంలో రెండు సీట్లు ఉంటాయి. లిథియం బ్యాటరీల సాయంతో ఇది నడుస్తుంది.

•ఈ విమానం అత్యధికంగా 3000 మీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు.

• 90 నిముషాల పాటు ఛార్జింగ్ పెడితే ఈ తేలికైన విమానం 45 నుంచి 60 నిముషాల పాటు ప్రయాణిస్తుంది.

• ఈ తేలికైన విమానాన్ని పైలెట్ల శిక్షణ కోసం, పరిశోధన కోసం వినియోగించుకునే అవకాశం ఉంది.

• ఈ విమానం ద్వారా గరిష్టంగా 480 కేజీల బరువు ను మోయగలదు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App


Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS