Search

క్రికెట్ ప్రపంచ కప్ లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా క్రిస్ గేల్

24 ఫిబ్రవరి 2015న వెస్ట్ ఇండీస్ క్రికెటర్ క్రిస్ గేల్, క్రికెట్ ప్రపంచ కప్ లో డబుల్ సెంచరీ చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.

Feb 26, 2015 09:08 IST
facebook IconTwitter IconWhatsapp Icon

24 ఫిబ్రవరి 2015న వెస్ట్ ఇండీస్ క్రికెటర్ క్రిస్ గేల్, క్రికెట్ ప్రపంచ కప్ లో డబుల్ సెంచరీ చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అతను ప్రపంచ కప్ 2015 లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 138 బంతులలో 202 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ కాన్బెర్రాలోని మనుకా ఓవల్ లో జరిగింది మరియు మ్యాచ్ ముగిసేసరికి గేల్, 147 బంతుల్లో 215 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేసిన జింబాబ్వే బౌలర్లు తినాశే పన్యంగర, ఛతారా, సీన్ విలియమ్స్, ఎల్టన్ చిగుంబుర, సికందర్ రజా, టఫద్జ్వా కమొంగోజి మరియు హామిల్టన్.
ఏ వన్డేల్లోనైనా ఇది వేగవంతమైన డబుల్ సెంచరీ. గత రికార్డులలో భారతదేశ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ 140 బంతులలో డబుల్ సెంచరీ చేశాడు. డిసెంబర్ 2011లో ఇండోర్ లొ గల హోల్కర్ క్రికెట్ స్టేడియం వద్ద వెస్ట్ ఇండీస్ కు వ్యతిరేకంగా ఆడిన ఒక మ్యాచ్లో సెహ్వాగ్ ద్విశతకం సాధించాడు.

ఇది కాక, గేల్ భారతదేశం వెలుపల వన్డేల్లో డబుల్ సెంచరీ మొదటి క్రికెటర్. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించినవారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. వారు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మరియు రోహిత్ శర్మ. గౌలియార్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ మొట్టమొదటి వన్డే డబుల్ సెంచరీ చేసాడు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS