Search

ఇన్ఫోసిస్ అధ్యక్షుడు,బోర్డు సభ్యుడు బిజి శ్రీనివాస్ రాజీనామా

ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్, బోర్డు సభ్యుడు బిజి శ్రీనివాస్ మే 28, 2014న తన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు.

May 29, 2014 12:08 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్, బోర్డు సభ్యుడు బిజి శ్రీనివాస్ మే 28, 2014న తన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు . ఈ రాజీనామా జూన్ 10, 2014 నుంచి అమల్లోకి రానుంది.  శ్రీనివాస్ 15 ఏళ్లుగా ఇన్ఫోసిస్ లో కొనసాగుతున్నారు. ఆయన జనవరి 2014లో యూబి ప్రవీణ్ రావుతో కలిసి ఇన్ఫోసిస్ అధ్యక్షుడిగా నియమించబడ్డారు.
 
ఇన్ఫోసిస్ కంపెనీలో ప్రస్తుతం తొలిసారిగా ఇన్ఫోసిస్ యేతర నాన్ ఫౌండర్ సీఈఓ అన్వేషణ కొనసాగుతుంది.
 
ఇన్ఫోసిస్ లిమిటెడ్

నారాయణమూర్తి సారధ్యంలో 1981లో స్థాపించబడిన ఇన్ఫోసిస్ లిమిటెడ్ కంపెనీ ఐటీ సేవలు, కన్సల్టింగ్ లో గ్లోబల్ లీడర్. ఈ కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ ఐన కంపెనీ. దీనిని ఏడుగురు ఇంజినీర్లు కేవలం 250 అమెరికన్ డాలర్లతో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ప్రస్తుతం 8.25 బిలియన్ అమెరికన్ డాలర్ల నికర సంపాదన మరియు 31 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కెట్ కాపిటలైజేషన్ ను కలిగి ఉంది.
 
భారతదేశం నుండి నాస్‌డాక్ లో లిస్ట్ అయిన తొలి ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ గుర్తింపు పొందింది.

ఈ కంపెనీ మారుతున్న కాలానుగుణంగా మొబిలిటీ, సస్టైయినబిలిటి, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అంశాలలో  నూతన ఎంటర్ప్రైజెస్ కు మెరుగైన నాయకత్వలక్షణాలు, స్ట్రాటేజిక్ కన్సల్టింగ్ మరియు కో క్రియేషన్ లో తోడ్పాటును అందిస్తుంది.

ఈ కంపెనీ 30 దేశాలలో తన సేవలను అందిస్తుంది. ఇన్ఫోసిస్ లిమిటెడ్ మే 22, 2014న గోల్డ్ అవార్డు ఫర్ సస్టైయినబుల్ బిల్డింగ్స్ అవార్డును అందుకుంది. లండన్ లోని రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీ 2014 ఇంటర్నేషనల్ ఆష్ డెన్ అవార్డులలో భాగంగా ఈ అవార్డును అందించింది.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS