Search

ద్రిష్టివ్యవస్థ అభివృద్ధి కోసం సిఎస్ఐఆర్ మరియు ఐఎండీ ఒప్పందం

విమాన రాకపోకలకు ఉపయోగపడే ద్రిష్టి వ్యవస్థ అభివృద్ధి కోసం సిఎస్ఐఆర్ మరియు ఐఎండీ మే 22, 2014న ఒక భాగస్వామ్య ఒప్పందం పై సంతకం చేశాయి.

May 28, 2014 11:06 IST
facebook IconTwitter IconWhatsapp Icon

విమాన రాకపోకలకు ఉపయోగపడే ద్రిష్టి వ్యవస్థ అభివృద్ధి కోసం సిఎస్ఐఆర్ NAL మరియు ఐఎండీ మే 22, 2014న ఒక భాగస్వామ్య ఒప్పందం పై సంతకం చేశాయి.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు ఇండియన్ మెటరలోజికల్ డిపార్టుమెంటుకు చెందిన ఉన్నతాధికారులు డాక్టర్ శ్యాం చెట్టి (సిఎస్ఐఆర్ డైరెక్టర్), డాక్టర్ ఎల్ఎస్ రాథోడ్ (ఐఎండీ డైరెక్టర్ జనరల్) ఈ ఒప్పందం పై సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా పరిశోధన మరియు అభివృద్దికి సంబంధించిన అనేక సెన్సార్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు.
 
ఈ ఒప్పందం కింద సిఎస్ఐఆర్ మరియు ఐఎండీ, వివిధ విమానాశ్రయాలలో మొత్తం 70 ద్రిష్టి వ్యవస్థలను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం దేశంలో ఏడూ విమనాశ్రయాలలో ద్రిష్టి వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఐదు వ్యవస్థలు ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉండగా, ఒక ద్రిష్టి వ్యవస్థను చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం (లక్నో)లో ఉంది. ఏడవ ద్రిష్టి వ్యవస్థ కోల్‌కతాలోని నేతాజీ సుబాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తుంది.
 
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అర్గనైజేషన్ మరియు వరల్డ్ మెటరలోజికల్ అర్గనైజేషన్ సూచనల ప్రకారం అన్ని విమానాశ్రయాలు ఈ వ్యవస్థ (ఉత్పాదన)ను కలిగి ఉండాలి. ఈ వ్యవస్థ విమాన రాకపోకలలో ఉపయోగపడే వ్యవస్థ.
 
ద్రిష్టి వ్యవస్థ

ద్రిష్టి వ్యవస్థ ఎయిర్పోర్ట్ రన్ వే విజువల్ రేంజ్ ను అంచనా వేసే ఒక అత్యాధునిక పరికరం. ఈ పరికరం విమానాల ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్ ల విషయంలో తక్కువ వెలుతురు ఉన్న సమయంలో పైలట్లకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

దృష్టి ట్రాన్ స్మిసోమీటర్ వ్యవస్థ, దృష్టి గోచరతను కొలిచే ఒక వినూత్నమైన దేశీయ ఉత్పత్తి. ఇప్పటివరకు ఇలాంటి ఆవిష్కరణ జరగలేదు. దీనిని సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ (నాల్) రూపొందించి, అభివృద్ధి పరిచింది. విమానాల సురక్షిత ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్ కోసం పైలట్లకు సహాయం అందించే ఈ వ్యవస్థ అత్యధిక దృష్టి గోచరత మరియు అత్యల్ప విస్తృత (<25> 2000 మీటర్ల) పరిధిని కలిగి ఉంటుంది.

ద్రిష్టి వ్యవస్థ 2013-14 సంవత్సరంలో అత్యంత వినూత్న, ప్రతిభావంతమైన ఉత్పత్తిగా నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NRDC), ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ (IETE) సంస్థ మరియు ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమికండక్టర్ అసోసియేషన్ (IESA) నుండి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS