Search

వరుసగా రెండు ఆస్కార్ అవార్డులను గెల్చుకున్న హాలీవుడ్ నటి లుయిస్ రైనెర్ నిర్యాణం

ప్రసిద్ధ హాలీవుడ్ నటి, వరుసగా రెండు ఆస్కార్ అవార్డులను గెల్చుకున్న లుయిస్ రైనెర్, లండన్ లో కన్నుమూశారు.

Dec 31, 2014 11:01 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ప్రసిద్ధ హాలీవుడ్ నటి, వరుసగా రెండు ఆస్కార్ అవార్డులను గెల్చుకున్న లుయిస్ రైనెర్ 30 డిసెంబర్ 2014న లండన్ లో కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతూ మరణించిన ఆమె వయస్సు 104 సంవత్సరాలు.

లుయిస్ రైనెర్ తొలిసారి, వరుసగా రెండు ఆస్కార్ అవార్డులను గెల్చుకున్న ఏకైక నటి. ఆమె ది గ్రేట్ జిగ్ఫెల్డ్ (1936) మరియు ది గుడ్ ఎర్త్ (1937) వంటి సినిమాలకు గాను ఆమె వరుసగా ఆస్కార్ అవార్డులను గెల్చుకున్నారు.

లుయిస్ రైనెర్ గురించి క్లుప్తంగా

• 12 జనవరి 1910న జన్మించిన రైనెర్, హాలీవుడ్ సినిమాల్లో అరంగేట్రం చేయడానికి ముందు ఎన్నో జర్మనీ మరియు ఆస్ట్రియన్ చిత్రాలలో నటించింది.
• ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రాల నిర్మాణ సంస్థ, మెట్రో గోల్డ్విన్ మేయర్ (ఎంజిఎం)లో 30వ దశకంలో చేరిన రైనెర్, విలియమ్ పావెల్ తో కలిసి తన తొలి చిత్రం ‘ఎస్కేపెడ్’లో నటించింది.

అకాడమీ అవార్డుల చరిత్రలో, లుయిస్ రైనెర్ కాకుండా వరుసగా రెండు ఆస్కార్ అవార్డులను గెల్చుకున్న ఇతర హాలీవుడ్ నటులు నలుగురు. వారు స్పెన్సర్ ట్రేసీ, కాథరిన్ హెప్ బర్న్, జాసన్ రోబర్డ్స్ మరియు టామ్ హాంక్స్.

లుయిస్ రైనెర్ తర్వాత, గెస్ హు ఇస్ కమింగ్ టు డిన్నర్ (Guess Who's Coming to Dinner-1967) మరియు ది లయన్ ఇన్ వింటర్ (The Lion in Winter-1968) అనే చిత్రాలకు గాను కాథరిన్ హెప్ బర్న్ వరుసగా రెండు ఆస్కార్ అవార్డులను అందుకున్న రెండవ నటిగా గుర్తింపు సాధించింది.

 

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS