Search

మయాన్మార్‌లో 60 ఏళ్ల తర్వాత తొలి మునిసిపల్ ఎన్నికల నిర్వహణ

మయాన్మార్‌లో, 27 డిసెంబర్ 2014న 60 ఏళ్ల తర్వాత తొలి మునిసిపల్ ఎన్నికలు జరిగాయి.

Dec 30, 2014 15:07 IST
facebook IconTwitter IconWhatsapp Icon

మయాన్మార్‌లో, 27 డిసెంబర్ 2014న 60 ఏళ్ల తర్వాత తొలి మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను  యాంగోన్ పట్టణ అభివృద్ధి కమిటీ (వైసిడిసి) ఎన్నిక కోసం నిర్వహించారు.

మయాన్మార్‌లో పెద్ద పట్టణమైన యాంగోన్ ప్రజలకు, ఈ ఎన్నికలు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది. 2011లో సైనిక పాలనను తొలగించిన తర్వాత ఏర్పడిన పాక్షిక పౌర ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహించింది.

కొన్ని షరతులతో జరిగిన ఈ ఎన్నికలలో ప్రతి ఇంటి నుండి ఒక్కరికి మాత్రమే ఓటును వేసే అవకాశం లభించింది. అభ్యర్ధుల వయస్సు పరిమితిని కూడా సరిగ్గా తెలపకుండా, ఈ ఎన్నికలను నిర్వహించారు. ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా రాజకీయ పార్టీల పై నిషేధం విధించబడింది. ఇన్ని అంక్షల కారణంగా ఎంతో మంది అర్హులు ఉన్న కూడా, కేవలం 4 లక్షల మంది యాంగోన్ ప్రజలు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోగలిగారు.

ఈ మునిసిపల్ కమిటీ యొక్క 115 స్థానాల కోసం ఎన్నికలు జరగగా, వ్యాపారవేత్తలు, పదవీ విరమణ పొందిన అధికారులు, కార్యకర్తలు 300 మంది పోటీ పడ్డారు. ముఖ్యంగా ఎన్నో ఉన్నతస్థాయి పదవులను ఎన్నికకు దూరంగా ఉంచారు.

వ్యాఖ్య

నవంబర్ 2015లో మయాన్మార్ దేశవ్యాప్తంగా, చారిత్రాత్మక ఎన్నికలు జరగనుండగా, ఈ యాంగోన్ మునిసిపల్ కమిటీ ఎన్నికలను మయాన్మార్ ప్రజాస్వామ్య సాధన కోసం వేసిన తొలి అడుగు ఎన్నికలుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

మయాన్మార్ లో అసంపూర్ణ రోడ్డు నిర్మాణాలు, పెరుగుతున్న అద్దెలు, అస్తవ్యస్త ట్రాఫిక్ మరియు శానిటేషన్ సదుపాయాలు మరియు ఉదాసీన కాలుష్య నియంత్రణ వ్యవస్థల పై మయాన్మార్ ప్రజలు తమ అసంతృప్తిని తెలియజేయడానికి ఈ ఎన్నికలు ఒక ఉత్తమ అవకాశంగా నిలిచాయి.

 

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS