Search

ఆసియా యొక్క 50మంది 2015 శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్

26 ఫిబ్రవరి 2015న ఆసియా యొక్క 50మంది 2015 శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది.

Feb 27, 2015 11:09 IST
facebook IconTwitter IconWhatsapp Icon

26 ఫిబ్రవరి 2015న ఆసియా యొక్క 50మంది 2015 శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఆరుగురు భారతీయ మహిళా సిఇవోలు మరియు మేనేజింగ్ డైరెక్టర్లు స్థానం సంపాదించారు.

ఒక సంవత్సరంలో మహిళా పారిశ్రామికవేత్తలకు మరియు అధికారులు సాధించిన విజయాలకు గుర్తింపుగా ఆసియాలో 50మంది శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో చేరుస్తారు.

ఈ జాబితాలో ఉన్న భారతీయ మహిళలు:

• అరుంధతి భట్టాచార్య, సిఎండి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా

• చందా కొచ్చార్, సీఈవో ఐసిఐసిఐ బ్యాంకు  

• అఖిల శ్రీనివాసన్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్/ శ్రీరాం కాపిటల్ ఎండి

• కిరణ్ మజుందార్ షా, బయోకాన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ మరియు ఎండి

• శిఖా శర్మ, ఆక్సిస్ బ్యాంకు సీఈవో మరియు ఎండి

• ఉషా సంఘ్వన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండి

 

ఈ జాబితాలో 27 మంది కొత్తవారు ఆధిపత్యం చెలాయించారు. వారిలో కొందరు:

 • నోని పుర్నోమో, ఇండోనేషియా యొక్క బ్లూ బర్డ్ గ్రూప్ హోల్డింగ్ అధ్యక్ష డైరెక్టర్

 • లీ అరె-జిన్, దక్షిణ కొరియా యొక్క హోటల్ షిల్లా యొక్క అధ్యక్షురాలు మరియు సీఈవో

• సోనియా చెంగ్, హాంగ్ కాంగ్ యొక్క రోజ్వుడ్ హోటల్ గ్రూప్, సీఈవో మరియు న్యూ వరల్డ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

• వండీ ఖున్చోర్న్యకొంగ్ , థాయిలాండ్ యొక్క SPCG ఛైర్మన్ మరియు సీఈవో

• కేటీ పేజీ, ఆస్ట్రేలియా హార్వే నార్మన్ సీఈవో

• లూసీ పెంగ్, ఆలీబాబా యొక్క సహ-వ్యవస్థాపకురాలు మరియు దాని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక-సేవల యూనిట్ వెనుక శక్తి

• మాగీ వు, ఆలీబాబా యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) మరియు దాని బ్లాక్బస్టర్ IPO డ్రైవర్

• గరంజవ్ త్సేడేన్, మైనింగ్ కంపెనీ మొన్పోలీమేట్ స్థాపకుడు మరియు చైర్మన్

• విన్ విన్ టింట్

 ఆలీబాబా యొక్క నిర్ణయాధికారులైన మాగీ వు మరియు లూసీ పెంగ్ లు ఈ జాబితాలో మొదటిసారి స్థానం సంపాదించారు.

మొదటిసారిగా, అభివృద్ధి చెందుతున్న దేశాలైన మంగోలియా మరియు మైయాన్మర్ ల నుండి విన్ విన్ టింట్ మరియు గరంజవ్ త్సేడేన్ లు ఈ జాబితాలో చేర్చబడ్డారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS