Search

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సరోష్ హోమీ కపాడియా మృతి

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సరోష్ హోమీ (ఎస్‌హెచ్) కపాడియా 5 జనవరి 2016న మరణించారు.

Jan 5, 2016 14:10 IST
facebook IconTwitter IconWhatsapp Icon

Sarosh Homi Kapadiaసుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సరోష్ హోమీ (ఎస్‌హెచ్) కపాడియా 5 జనవరి 2016న మరణించారు. ఆయన వయసు 68 ఏళ్ళు.
జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ కపాడియా 10 మే 2010 న ప్రధాన న్యాయమూర్తి అయ్యి 28 సెప్టెంబర్ 2012 వరకు ఆ పదవిలో కొనసాగారు.

సరోష్ హోమీ కపాడియా గురించి
• ఎస్‌హెచ్ కపాడియా 29 సెప్టెంబర్ 1947న ముంబైలో ఒక నిరుపేద పార్సీ కుటుంబంలో జన్మించారు.
• అతను ఆసియాలోనే పురాతన న్యాయ కళాశాలైన గవర్నమెంట్ లా కాలేజీ, ముంబై నుండి పట్టభద్రుడయ్యారు. కపాడియా, క్లాస్ IV ఉద్యోగిగా తన వృత్తిని ప్రారంభించారు.
• కార్మిక న్యాయవాది ఫిరోజ్ దమనియా స్పూర్తితో అతను 10 సెప్టెంబరు 1974 న బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా చేరారు.
• ఆయన 8 అక్టోబరు 1991 న బొంబాయి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయి, 23 మార్చి 1993 న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మరియు 18 డిసెంబర్ 2003 న, ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి గా నియమితులయ్యారు
• ఆయన 5 ఆగష్టు 2003 న ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మరియు 18 డిసెంబర్ 2003 న, ఆయన సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి గా నియమితులయ్యారు
• వోడాఫోన్ కేసు తీర్పు, మీడియా విచారణ విషయంలో ఐదుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం తీర్పు లాంటివి జస్టిస్ కపాడియా హయాంలోనే వెలువడ్డాయి.  
• 2012 సెప్టెంబర్ నెలలో పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన ఎలాంటి కమిటీలలో లేరు, ఇతర పదవులు చేపట్టలేదు.
Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS