Search

గుజరాత్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మోడీ రాజీనామా

గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి బిజెపి ప్రధాని అభ్యర్థి మోడీ మే 21, 2014న రాజీనామా చేశారు.

May 26, 2014 09:07 IST
facebook IconTwitter IconWhatsapp Icon

గుజరాత్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బిజెపి ప్రధాని అభ్యర్థి మోడీ మే 21, 2014న రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌ కమలాబేణివాల్‌కు సమర్పించారు. ఈ రాజీనామాతో ఆయన తన ఎం.ఎల్.ఏ పదవికి కూడా రాజీనామా చేసినట్లైంది.

నరేంద్ర మోడీ స్థానంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ మే 22,2014న బాధ్యతలను చేపడతారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో వదోదర మరియు వారణాసి లోక్‌సభ స్థానాల నుంచి విజయం సాధించిన నరేంద్ర మోడీ మే 26, 2014న భారతదేశ 15వ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు.

నరేంద్ర మోడీ

• నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17, 1950న గుజరాత్ లోని మెహ్సానా జిల్లా, వాద్‌నగర్ లో జన్మించారు.
• ఆయన 2001-2014 మధ్య కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అక్టోబర్ 2001లో కేశూభాయి పటేల్ ఉప ఎన్నికలలో భాజపా ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి.
• 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు.
• 2014 సార్వత్రిక ఎన్నికలలో భాజపా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్.డి.ఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించారు. ఆయన మే 26, 2014న ప్రధానమంత్రి పదవీ బాధ్యతలను చేపడతారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS