Search

రైల్వే రంగంలో సహకారం కోసం మూడు ఒప్పందాలు కుదుర్చుకున్న భారతదేశం మరియు జపాన్

భారతదేశం మరియు జపాన్ 12 డిసెంబర్ 2015 న ముంబై - అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ (బుల్లెట్ రైలు ప్రాజెక్టు) కోసం సహకారం మరియు సహాయార్థం ఒక అవగాహనా ఒప్పందం (MoU) పై సంతకాలు చేశాయి.

Dec 14, 2015 17:05 IST
facebook IconTwitter IconWhatsapp Icon

భారతదేశం మరియు జపాన్ 12 డిసెంబర్ 2015 న ముంబై - అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ (బుల్లెట్ రైలు ప్రాజెక్టు) కోసం సహకారం మరియు సహాయార్థం ఒక అవగాహనా ఒప్పందం (MoU) పై సంతకాలు చేశాయి.

రెండు దేశాలు 11 డిసెంబర్ 2015 న భారతీయ రైల్వేల ఆధునీకరణ మరియు అభివృద్ధి కోసం రెండు సమగ్ర సాంకేతిక సహకారం ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నాయి.

ముంబై - అహ్మదాబాద్ హెచ్ఎస్ఆర్ ప్రాజెక్ట్ కోసం సహకారం సహాయార్థం అవగాహన ఒప్పందం
• జపాన్ ఈ ప్రాజెక్ట్ కోసం 79000 కోట్ల రూపాయలు పైగా సహాయం అందించింది.
• ఈ రుణానికి 0.1 శాతం వడ్డీ రేటుతో 15 సంవత్సరాల అధికారిక కాలయాపనతో 50 సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది.
• ఈ ప్రాజెక్టు మొత్తం 97636 కోట్ల రూపాయల ఖర్చుతో 508 కిమీ రైల్వే లైన్.
• ఈ ప్రాజెక్టు ఏడు సంవత్సరాల కాలంలో అమలు చేయబడుతుంది.
• షింకాన్సెన్ టెక్నాలజీ ని ఈ ప్రాజెక్ట్ కోసం ఉపయోగించడం జరుగుతుంది.
• జపాన్ యొక్క సహకారం సాంకేతిక పరిజ్ఞానం బదిలీ మరియు మేక్ ఇన్ ఇండియా కోసం స్థిరంగా ఉంటుంది.
• జపాన్, హెచ్ఎస్ఆర్ కోసం సిబ్బంది శిక్షణలో భారతదేశానికి సహాయపడనుంది.

సాంకేతిక సహకారం కోసం భారత రైల్వే మంత్రిత్వ శాఖ మరియు ఎంఎల్ఐటి, జపాన్ మధ్య సహకార ఒప్పందం (MoC)

జపాన్ క్రింది విభాగాల్లో సహకారం చేయనుంది:
• రైల్వే రక్షణ
• రైలు సెట్లు / ఇఎంయు లతో సహా రోలింగ్ స్టాక్
• స్టేషన్ అభివృద్ధి మరియు భూమి విలువ సంగ్రహణము కోసం సమాచార భాగస్వామ్యము
• రైళ్లలో పర్యావరణ అనుకూల పారిశుధ్య సాంకేతికత కోసం సమాచారం భాగస్వామ్యము
• సిగ్నలింగ్ మరియు టెలీకమ్యూనికేషన్
• రైల్వే విద్యుదీకరణ
• సివిల్ నిర్మాణం మరియు రైల్వే ట్రాక్ వ్యవస్థ
• రైలు నియంత్రణ వ్యవస్థ
• సహజ విపత్తుల ఉపశమనము
• ఏవైనా ఇతర విభాగాలను ఈ ఒప్పందం పరిధిలో ఇరువర్గాలు సంయుక్తంగా నిర్ణయిస్తాయి

ఆర్డిఎస్ఓ మరియు జపాన్ రైల్వే టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మధ్య సాంకేతిక సహకార ఒప్పందం
• దేశాల మధ్య పరస్పర ఆసక్తి, సంప్రదింపులు మరియు ఇతర సేవల పనితీరును కలిగి ఉండే రైలుకు సంబంధించిన సాంకేతిక సహకార అభివృద్ధి, రెండు దేశాల మధ్య సహకారంలో ప్రధాన ఆదేశాలతో ఉంటుంది.

సాంకేతిక సహకార విస్తృత రంగాలు:
• రైలు పనితీరులో భద్రత
• నిర్వహణలో ఆధునిక పద్ధతులు
• పర్యావరణ అనుకూల సాంకేతికతల ఉపయోగం
• మొత్తం ప్రాజెక్టు కోసం అభివృద్ది చర్యలు
• రెండు పార్టీలు సంయుక్తంగా అంగీకరించే ఏవైనా ఇతర విభాగాలు

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS