Search

ఇండియా-ఫ్రాన్స్ ల మధ్య అంతర్జాతీయ సౌర విద్యుత్ కూటమి

ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాలమధ్య 30 నవంబర్ 2015న అంతర్జాతీయ సౌర విద్యుత్ కూటమి ఏర్పడింది.  యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (కాప్ 21) సందర్భంగా భారత్ ప్రధాని నరేంద్రమోడీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ లు సంయుక్తంగా కూటమి ఏర్పాటుకు అవగాహన కుదిరింది.

Dec 2, 2015 17:06 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాలమధ్య 30 నవంబర్ 2015న అంతర్జాతీయ సౌర విద్యుత్ కూటమి ఏర్పడింది.  యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (కాప్ 21) సందర్భంగా భారత్ ప్రధాని నరేంద్రమోడీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ లు సంయుక్తంగా కూటమి ఏర్పాటుకు అవగాహన కుదిరింది.

 ఈ కూటమి ఉష్ణమండలాలు మరియు ఇతర దేశాలను ఆహ్వానించింది. ఈ కూటమి గుర్గావ్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నుంచి కార్యకలాపాలు సాగిస్తుంది.

ఈ కూటమిలోని ముఖ్యాంశాలు

• దీని ద్వారా ఉష్ణమండలాల్లోని 121 దేశాలు సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ పెడతాయి.

•  ఈ కూటమి ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఆయా దేశాలకు విస్తారమైన, ఉచిత సహజ వనరును విరివిగా ఉపయోగించుకోవాలని నిర్ణయించాయి.

• సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి సాంకేతిక, ఆర్ధిక ఖర్చుల్ని తగ్గించుకునే దిశగా ఈ కూటమి శ్రద్ధ పెడుతుంది.

• ఆయా దేశాలు వ్యక్తిగతంగా సౌరవిద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన కొత్త సాంకేతిక పద్ధతులను అన్వయించుకుంటాయి.

• ఈ కూటమి ద్వారా శిక్షణలో సహకారం, వివిధ సంస్థల ఏర్పాటు, నియంత్రణ పద్ధతులు, ప్రమాణాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో పరస్పరం అవగాహనకు వస్తాయి. అవసరాన్ని బట్టి ఉమ్మడి సంస్థలను ఏర్పాటుచేసుకుంటాయి.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App


Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS