Search

కెనడా నుంచి మొదటి విడత యురేనియంను పొందిన భారతదేశం

భారతదేశం 4 డిసెంబర్ 2015 న కెనడా నుండి మొదటి విడతగా 2730 టన్నుల యురేనియం రవాణాసరుకును పొందింది. ఈ యురేనియం దేశంలోని అణు విద్యుత్ రియాక్టర్ల కోసం భారతదేశానికి సరఫరా చేయబడుతుంది.

Dec 7, 2015 18:10 IST
facebook IconTwitter IconWhatsapp Icon

 భారతదేశం 4 డిసెంబర్ 2015 న కెనడా నుండి మొదటి విడతగా 2730 టన్నుల యురేనియం రవాణాసరుకును పొందింది. ఈ యురేనియం దేశంలోని అణు విద్యుత్ రియాక్టర్ల కోసం భారతదేశానికి సరఫరా చేయబడుతుంది.

రవాణా చేయబడిన యురేనియం ఉత్తర సస్కట్చేవాన్ లోని కమెకో యొక్క మెక్ఆర్థర్ రివర్ మరియు కీ లేక్ కార్యకలాపాలు వద్ద సంగ్రహణము మరియు మిల్లింగ్ చేయబడింది.

ఈ రవాణాకు సంబంధించిన వాస్తవాలు

• ఈరవాణాసరుకు 2015 లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒట్టావా పర్యటన సందర్భంగా భారతదేశం యొక్క అటామిక్ ఎనర్జీ విభాగంతో ఒక ఒప్పందం కుడుర్చుకున్న కెనడా యొక్క కమెకో ఇంక్ ద్వారా రవాణా చేయబడింది.

• కెనడా 1974 లో భారతదేశం యొక్క మొదటి అణు పరీక్ష గురించి గట్టిగా నిరసన ప్రకటించిన తర్వాత నాలుగు దశాబ్దాల కంటే ఎక్కువ కాలం తరువాత కమెకో నుండి మొదటి విడత యురేనియం సరఫరా జరిగింది. ఆ తర్వాత కెనడా పూర్తిగా భారతదేశానికి యురేనియం మరియు అణు హార్డ్ వేర్ ఎగుమతులు నిషేధించింది.

 భారతదేశం మరియు కెనడా మధ్య అణు ఒప్పందం గురించి

• సెప్టెంబర్ 2013 లో కెనడా మరియు భారతదేశం మధ్య అణు సహకారం ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ 2015 లో కమెకో, భారతదేశం తో యురేనియం సరఫరా ఒప్పందంఫై సంతకం చేసింది.

• ఏప్రిల్ 2015 లో సంతకం చేసిన ఈ ఒప్పందంలో భాగంగా కెనడా యొక్క కమెకో కార్పొరేషన్ 2020 వరకు భారతదేశానికి 7.1 మిలియన్ పౌండ్ల యురేనియం ను సరఫరా చేస్తుంది.

• ఈ ఒప్పందం 350 మిలియన్ల US డాలర్ల విలువ కలిగినది.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

 

 

 

 

 

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS