Search

తొలిసారిగా ఇంటర్‌సెప్టార్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్

శత్రు క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకుని ధ్వంసం చేసే ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి-పృథ్వి డిఫెన్స్ వెహికల్ ను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది.

Apr 28, 2014 10:34 IST
facebook IconTwitter IconWhatsapp Icon

శత్రుదేశాల క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకుని ధ్వంసం చేసే ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి-పృథ్వి డిఫెన్స్ వెహికల్ (పిడివి)పరీక్షను భారత్‌ తొలిసారిగా విజయవంతంగా నిర్వహించింది. ఈ విజయంతో బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ రూపకల్పనలో మన దేశం మరో మరో మైలురాయిని దాటింది.
 
ఒడిషాలోని బాలాసోర్‌కు 100 కి.మీ దూరంలో వున్న వీలర్‌ ఐలాండ్ లో వున్న సమీకృత ప్రయోగ కేంద్రంలోని లాంచ్‌పాడ్‌-4 నుండి ఏప్రిల్ 27, 2014న ఉదయం 9.10 గంటల సమయంలో ఈ ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి నింగిలోకి దూసుకెళ్లింది. అంతకు ముందు ప్రత్యర్ధులు ప్రయోగించిన రీతిలో ఒక డమ్మీ క్షిపణిని ఉదయం 9.06 గంటలకు దూరంగా వున్న నౌకనుండి ప్రయోగించారు.
 
ఈ డమ్మీ క్షిపణి ప్రయోగసంకేతాలను అందుకున్న ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి వెంటనే నింగిలోకి దూసుకెళ్లి దానిని విజయవంతంగా ఛేదించిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) ప్రతినిధి రవికుమార్‌ గుప్తా మీడియాకు చెప్పారు.
 
120 కిలోమీటర్లకు పైగా ఎత్తులో భూ వాతావరణం వెలుపల ఉన్న టార్గెట్లను ధ్వంసం చేయడం లక్ష్యంగా ఈ పిడివిని రూపొందించినట్లు డిఆర్‌డిఓ తెలియజేసింది. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసమే పిడివి ఇంటర్‌సెప్టర్‌ను, అలాగే మోర్టార్లతో కూడిన రెండు స్టేజిల టార్గెట్‌ను రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది. 2 వేల కిలోమీటర్ల దూరంనుంచి దూసుకు వస్తున్న బాలిస్టిక్ క్షిపణిని నిర్వీర్యం చేస్తున్నట్లుగా జరిపిన ఈ ప్రయోగాన్ని బంగాళాఖాతంలోని ఓ నౌకనుంచి జరిపారు.
 
పూర్తిగా ఆటోమేటిక్ వ్యవస్థలతో జరిపిన ఈ ప్రయోగంలో వీలర్ ఐలాండ్ వద్ద సిద్ధంగా ఉంచిన పిడివి రాడార్లనుంచి అందిన డేటా సాయంతో కంప్యూటర్లు దూసుకు వస్తున్న శత్రు క్షిపణి దూరాన్ని కచ్చితంగా గుర్తించిందని డిఆర్‌డిఓ తెలిపింది.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS