Search

ఈ వారం భారత్ : ఆగస్ట్ 11, 2014 – ఆగస్ట్ 17, 2014

ఈ వారం భారత్ (ఆగస్ట్ 11, 2014 – ఆగస్ట్ 17, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.

Aug 18, 2014 17:09 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ (ఆగస్ట్ 11, 2014 – ఆగస్ట్ 17, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాలను) విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. జాగరణ్ జోష్ బృందం జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను తేదీల ప్రకారం అందిస్తుంది.

11 ఆగస్ట్ 2014

• లోక్‌సభలో జుడిషియల్ అప్పాయింట్ మెంట్స్ కమిషన్ బిల్లు-2014 ను, ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
• తొలి లోక్‌సభ సభ్యుడు, రేషంలాల్ జంగాడే మరణం
• నో యువర్ కస్టమర్, (కేవైసి) రిజిస్ట్రేషన్ ఏజెన్సీ(రెండవ సవరణ) నిబంధనలు-2014ను వెలువరించిన సెబీ
• ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లలో టెస్ట్ ఆల్ రౌండర్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచిన రవిచంద్ర అశ్విన్; భారత జట్టుకు నాలుగో స్థానం
• స్వాతంత్ర్య సమరయోధురాలు, కమలమ్మ శారద ప్రసాద్ (92) కన్నుమూత

12 ఆగస్ట్ 2014

• లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన ఎం తంబిదురై
• వ్యయాల మేనేజ్మెంట్ కమిషన్ కు అధ్యక్షత వహించనున్న మాజీ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ బిమల్ జలాన్
• ప్రసిద్ధ బుర్రకథ కథకురాలు దారోజి ఎర్రమ్మ మరణంతో వార్తల్లో నిలిచిన బుర్రకథ అనే కళ (కథా ప్రక్రియ)  
• అవుట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డులను పొందిన కరణ్ సింగ్, అరుణ్ జైట్లీ మరియు శరద్ యాదవ్
• 2014 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కోసం ఎలాంటి నామినేషన్లను ప్రకటించని ఎంపిక కమిటి
• ఈశాన్య ప్రాంతంలో విదేశీ పర్యాటకులకు అత్యంత ఉత్తమ విడిది కేంద్రంగా మారిన సిక్కిం
• విజయవాడను అడ్హాక్ రాజధానిగా చేయటానికి నిర్ణయించిన అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

13 ఆగస్ట్ 2014

• గంగా క్లీన్ అప్, రోడ్ మ్యాప్ రూపకల్పన కోసం కేంద్ర ప్రభుత్వానికి రెండు వారాల సమయాన్ని ఇచ్చిన సుప్రీంకోర్టు
• ఇంటర్నేషనల్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ అందించే గ్లోబల్ సౌత్ అవార్డు-2014ను అందుకున్న ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు డాక్టర్ సునీల్ కుమార్
• ఫీల్డ్స్ పతకాన్ని అందుకున్న భారత సంతతికి చెందిన గణిత శాస్త్రవేత్త మంజుల్ భార్గవ
• ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ లో సెమీఫైనల్ చేరిన తొలి భారత ఆటగాడిగా కుష్ కుమార్ ఘనత
• భారతదేశంలో తొలి పారా గ్లైడింగ్ ప్రపంచ కప్ కు, ఆతిధ్యం ఇవ్వడానికి ఎంపికైన హిమాచల్ ప్రదేశ్

14 ఆగస్ట్ 2014

• సిగరెట్ మరియు బీడీల నిషేధం పై ఉన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) పై, అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్రానికి నోటీసులను జారీ చేసిన సుప్రీంకోర్టు
• 60 ఏళ్ళు పైబడిన వారి కోసం ఉద్దేశించిన వరిష్ఠ పెన్షన్ బీమా యోజన పథకాన్ని, తిరిగి ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

15 ఆగస్ట్ 2014
 
• 15 ఆగస్ట్ 2014న, 68వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న భారత్

16 ఆగస్ట్ 2014
 
• పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోల్‌కతాను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

17 ఆగస్ట్ 2014

• రాజస్థాన్ బ్లాకులో ముడి చమురు ఉత్పత్తిని పెంచమని కేయిర్న్ ఇండియాకు క్లియరెన్స్ ఇచ్చిన కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS