Search

ఈ వారం భారత్ : 12 మే 2014 -18 మే 2014

ఈ వారం భారత్ ( 12 మే 2014 – 18 మే 2014), వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.

May 22, 2014 12:03 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ ( 12 మే 2014 – 18 మే 2014), వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన అంశాలను విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను తేదిల ప్రకారం అందిస్తున్నాం.


12 మే 2014

• 35 మంది నర్సులకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
• పశ్చిమబెంగాల్ శారదా చిట్ ఫండ్ కంపెనీ కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక విచారణ టీమ్(సిట్)ను సిబిఐ  ఏర్పాటుచేసింది.
• 20వ జాతీయ సీనియర్ మహిళల ఫుట్‌బాల్ ఛాంపియన్స్ టైటిల్ ను కైవసం చేసుకున్న మణిపూర్ జట్టు


13 మే 2014

• 28వ ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా లెఫ్టినెంట్ గవర్నర్ దల్బీర్ సింగ్ సుహాగ్ నియామకానికి కేబినెట్ కమిటీ ఆమోదముద్ర
• సుప్రీంకోర్టు జడ్జీల నియామకం కోసం గోపాల్ సుబ్రమణియం మరియు ఆర్.ఎఫ్.నరిమన్ ల పేర్లను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొల్లేజియం.
• ప్రజా వేగుల రక్షణ బిల్లు 2011కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర
• ఢిల్లీలో కాలుష్య నివారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్

14 మే 2014

• కావేరి జల వివాదాల ట్రిబ్యునల్ చైర్మన్ గా జస్టిస్ బి.ఎస్.చౌహాన్ నియామకం
• సిసిఐ క్లాసిక్ బిలియర్డ్స్ టైటిల్ విజేత పంకజ్ అద్వానీ
• 2014 గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఎంపికైన టెక్నోపార్క్ టిబిఐ
• గుర్గావ్ రాపిడ్ మెట్రో రైల్ లో ఉచిత వై-ఫై సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ఎంటీఎస్ మొబైల్ నెట్‌వర్క్ సంస్థ
• వారణాసిలో రోజుకు ఐదు లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్ధ్యం గల డైరీ ప్లాంట్ నిర్మాణానికి అమూల్ కంపెనీ ప్రతిపాదన
• టిఐఈ సిలికాన్ వ్యాలీతో ఓడిశా రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం
• ఎల్‌టిటిఇ పై మరో అయిదేళ్ల పాటు నిషేధాన్ని పొడిగించిన భారత ప్రభుత్వం

15 మే 2014

• కేంద్ర జల సంఘం చైర్మన్ గా అశ్విన్ బి పాండ్యా నియమితులయ్యారు
• ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త మల్లాది సుబ్బమ్మ కన్నుమూత

16 మే 2014

• టాటా స్టీల్స్ మాజీ చైర్మన్ రుస్సీ మోడీ కన్నుమూత
• ఓడిశా రాష్ట్రంలో 26 కంపెనీల ముడి ఇనుము మైనింగ్ కార్యకలాపాల పై మధ్యంతర స్టే విధించిన సుప్రీంకోర్టు
• 2014-ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో తెదేపా ఘన విజయం
• ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ బాధ్యతను ముకుల్ ముద్గల్ కమిటీకి అప్పగించిన సుప్రీంకోర్టు
• 2014-సిక్కిం అసెంబ్లీ ఎన్నికలలో సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఘన విజయం
• 2014-అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం
• 2014-ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో బిజూ జనతా దళ్ ఘన విజయం
• 16వ లోక్ సభ ఎన్నికలలో 282 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం

17 మే 2014

• బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా
• ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లువాలియా రాజీనామా
• లీలా గ్రూప్ హోటల్స్ వ్యవస్థాపకుడు కృష్ణన్ నాయర్ అస్తమయం
• రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తన రాజీనామాను సమర్పించిన ప్రధాని మన్మోహన్ సింగ్

18 మే 2014

• ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త ఎన్.శ్రీనివాసన్ మరణం
• అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నబం తుకీ

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS