Search

ఈ వారం భారత్ : 16 జూన్ 2014–22 జూన్ 2014

ఈ వారం భారత్ (16 జూన్ 2014 – 22 జూన్ 2014), వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం రూపొందించబడినది.

Jun 23, 2014 13:10 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ (16 జూన్ 2014 – 22 జూన్ 2014), వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాలను), విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. జాగరణ్ జోష్ బృందం జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను తేదీల ప్రకారం అందిస్తుంది.

16 జూన్ 2014

• వార్షిక అణు దళాల డేటాను విడుదల చేసిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి)
• భారతదేశంలో మహిళల కోసం ఏర్పాటైన మొదటి వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్ ఓ.ఎస్.సి.సి “గౌరవి”ని భోపాల్ లో సినీనటుడు అమీర్ ఖాన్ ప్రారంభించారు
• కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల మంత్రిత్వశాఖ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల కోసం ఆన్‌లైన్‌ ఫైనాన్స్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ప్రారంభించింది
• డిఎల్ఎఫ్ హోం డెవలపర్స్ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషణ్ (ఐఎస్ఓ) నాణ్యత సర్టిఫికేషన్ ను పొందింది
• రోడ్డు భద్రత కోసం డిస్ట్రిక్ట్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్
• భారతదేశంలో తొలి కిరోసిన్ రహిత నగరంగా ఢిల్లీ నగరం గుర్తింపు పొందింది

17 జూన్ 2014
 
• భారతదేశ ప్రధానమంత్రి నేతృత్వంలో ఉండే జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఎం.శశిధర్ రెడ్డి
• దేశవ్యాప్తంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ
• ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బన్వరి లాల్ జోషి తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు
• వోడాఫోన్ పన్ను ఎగవేత వివాదం కేసులో భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్.సి.లహోటిని మధ్యవర్తిగా నియమించిన కేంద్ర క్యాబినెట్
• డెబ్ట్ సెక్యూరిటీస్ పబ్లిక్ ఇష్యూ కు సంబంధించి నూతన షరతులను ప్రవేశపెట్టిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)
• ఇన్ఫోసిస్ కంపెనీ సహవ్యవస్థాపకుడు ఎన్.ఎస్. రాఘవన్ పలడియోన్ నెట్‌వర్క్స్ ను కొనుగోలు చేశారు
• ఎయిమ్స్ భోపాల్ లో ప్రాంతీయ పారామెడికల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
• ఢిల్లీలో 500 నీటి ఏటిఎంల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్

18 జూన్ 2014

• భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైన రాజీవ్ తోప్నో
• భారత సైన్యం ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్-బాలాసోర్) ఒడిశాలో అత్యంత తక్కువ ఎత్తులో సూపర్సోనిక్ ఆకాష్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించింది
• చత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్ శేఖర్ దత్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు
• ముళ్ళపెరియార్ డ్యాం భద్రత మరియు పునరుద్ధరణ వంటి అంశాలను పరిశీలించడం కోసం కమిటీ ఏర్పాటుకు ఆమోదించిన క్యాబినెట్
• వాణిజ్య బ్యాంకులు తమ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో సెక్టార్ల వారీగా అడ్వాన్స్ వివరాలను తెలపాలని ఆదేశించిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ)
• రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో తొలి మహిళా డైరెక్టర్ గా నీతా అంబానీ నియమించబడ్డారు
• నర్మదా మాల్వా గంభీర్ లింక్ ప్రాజెక్టు (ఎన్.ఎం.జి.ఎల్.పి) కు ఆమోదం తెలిపిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

19 జూన్ 2014

• తొలిసారిగా టాంగ్ ప్రైజ్ 2014 విజేతల జాబితా ప్రకటన
• పరిపాలనలో ఆరు (6) క్యాబినెట్ కమిటీలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
• హిమాలయన్ నాచురల్ మినరల్ వాటర్ బ్రాండ్ వ్యవస్థాపకుడు దాది బాలసర (81) మరణం

20 జూన్ 2014

• 2013 జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ హిందీ భాష కవి, రచయిత కేదార్ నాథ్ సింగ్
• మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన సార్క్ మాన్సూన్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం జాతీయ వర్కింగ్ గ్రూప్ సమావేశం
• విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి అసెంబ్లీ స్పీకర్‌గా కోడెల శివప్రసాద రావు ఎన్నికయ్యారు
• పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జల్పాయిగురి జిల్లా నుంచి అలీపుర్దార్ జిల్లా ఏర్పాటు
• 2014-15 ఆర్ధిక సంవత్సరానికి పన్ను రహిత బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్
• హిందూ మహాసముద్రం యొక్క వివిధ అంశాల పై అధ్యయనానికి “మౌసమ్” అనే ప్రాజెక్టును ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ

21 జూన్ 2014

• ప్రయాణ (14.2 శాతం) మరియు సరకురవాణా (6.5 శాతం) ఛార్జీలను పెంచిన భారతీయ రైల్వే
• భిలాయి స్టీల్ ప్లాంటులో గ్యాస్ లీకేజ్ ఉదంతం పై విచారణకు కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

22 జూన్ 2014

• అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) విడుదల చేసిన వన్డే పురుషుల క్రికెట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఏబి డివిలియర్స్ కు అగ్రస్థానాన్ని కోల్పోయిన విరాట్ కోహ్లి
• గుజరాత్ రాష్ట్రంలోని 11వ శతాబ్దపు మెట్లభావి రాణి కి వావ్ కు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు
• ప్రసిద్ధ తమిళ నిర్మాత, దర్శకుడు రామనారాయణన్ కన్నుమూత

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS