Search

ఈ వారం భారత్ : ఆగస్ట్ 18, 2014- ఆగస్ట్ 24, 2014

ఈ వారం భారత్ (ఆగస్ట్ 18, 2014 – ఆగస్ట్ 24, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.

Aug 26, 2014 07:12 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ (ఆగస్ట్ 18, 2014 – ఆగస్ట్ 24, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాలను) మరియు ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన వాటిని తేదీల ప్రకారం విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది.

18 ఆగస్ట్ 2014

• స్వచ్ఛ భారత్ మిషన్ కోసం 200 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు ప్రకటించిన టిసిఎస్ మరియు భారతి ఫౌండేషన్
• 2015 ఆగస్ట్ లో జరిగే ఫుట్ బాల్ ఫెడరేషన్ కప్ కు ఆతిధ్యం వహించనున్న జమ్మూకాశ్మీర్
• 2014 ఆసియన్ క్రీడల, చెఫ్ డి మిషన్ గా అడిల్లె సుమరివాలా నియామకం
• ఢిల్లీ జింఖానా క్లబ్ వ్యవస్థాపకుడు, దిల్ భాగ్ సింగ్ (81) కన్నుమూత

19 ఆగస్ట్ 2014

• దేశవ్యాప్తంగా పంటలకు సాగునీరు అందించేందుకు, ప్రధాన్ మంత్రి క్రిషి సీన్చాయి యోజన పథకాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ
• విరివిగా మొక్కలను నాటడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన బిఎస్ఎఫ్ ఉద్యోగులు
• మానవ హక్కుల ఉద్యమకారిణి, ఇరోం షర్మిలను విడుదల చేయాలని మణిపూర్ కోర్టు ఆదేశం
• భారత క్రికెట్ జట్టు డైరెక్టర్ గా, మాజీ క్రికెటర్ రవి శాస్త్రి నియామకం
• ఫరజ్ అహ్మద్ రచించిన, ‘అస్సాస్సినేషన్ అఫ్ రాజీవ్ గాంధీ’ పుస్తకావిష్కరణ

20 ఆగస్ట్ 2014

• న్యాయ కమిషన్ నివేదికకు స్పందించనందుకు గాను 14 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిమాన విధించిన సుప్రీంకోర్టు
• ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్  (ఎఫ్ఎంసి)ను పటిష్టం చేసేందుకు డ్రాఫ్ట్ నియమాలను జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
• భారతదేశంను డిజిటల్లీ నాలెడ్జ్ ఎకానమీగా, చేసే డిజిటల్ ఇండియా ప్రోగ్రాంను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్
• భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు గౌరవ డాక్టరేటును అందించిన పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం
• నాగపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్
• ఉనాలో ఆందోళన కలిగిస్తున్న స్త్రీ పురుషుల నిష్పత్తి, విషయమై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్
• ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ గా టిఎం భాసిన్ ఎన్నిక
• 22వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డును అందుకున్న చిత్ర దర్శకుడు ముజాఫర్ అలీ
• ప్రపంచ ప్రసిద్ధ యోగా గురు బికేఎస్ అయ్యంగార్ నిర్యాణం

21 ఆగస్ట్ 2014

• 2014 ‘రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్’ కు ఎంపికైన గురు హనుమాన్ అఖరా
• ఇందిరాగాంధీ హత్యోదంతం ఆధారంగా రూపొందించిన, కుమ్ దే హీరే చిత్ర విడుదల నిలిపివేత
• థాయిలాండ్ ప్రధానిగా ఎన్నికైన థాయ్ తిరుగుబాటు నాయకుడు ప్రయూత్ చాన్ ఒచా
• మాస్టర్ ప్లాన్ ఆఫ్ ఢిల్లీ-2021 సవరణను, ఆమోదించిన ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ (డిడిఏ)
• 765 కిలో వోల్టుల (కేవి) రాంచీ-సిపత్ ట్రాన్స్మిషన్ లైన్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
• హాకీ ఇండియా, 23వ అసోసియేట్ సభ్యుడిగా హాకీ మధ్యప్రదేశ్ ఎన్నిక

22 ఆగస్ట్ 2014

• ప్రముఖ కన్నడ రచయిత ఉడుపి రాజగోపాలాచార్య (యూ.ఆర్) అనంతమూర్తి (82) మృతి
• ఇథనాల్ తో నడిచే తొలి భారతీయ బస్సును నాగపూర్ లో ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

23 ఆగస్ట్ 2014

• న్యూఢిల్లీలో 20వ వార్షిక, ఢిల్లీ బుక్ ఫెయిర్ ప్రారంభం

24 ఆగస్ట్ 2014

• మహారాష్ట్ర గవర్నర్ కే.శంకర నారాయణన్ రాజీనామా
• పశ్చిమబెంగాల్ లో 6వ విడత కేకేఎం రూరల్ ఫుట్‌బాల్ టోర్నమెంటును ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS