Search

ఈ వారం భారత్ : 19 మే 2014 -25 మే 2014

ఈ వారం భారత్ ( 19 మే 2014 – 25 మే 2014), వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.

May 26, 2014 17:48 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ ( 19 మే 2014 – 25 మే 2014), వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన అంశాలను విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను తేదిల ప్రకారం అందిస్తున్నాం.

19 మే 2014

• ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి (పిఎంఈఏసి) ఛైర్మన్ చక్రవర్తి రంగరాజన్ రాజీనామా
• 2014 సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక ఓటు హక్కు వినియోగాన్ని (88.22 శాతం) నమోదు చేసిన అస్సాంలోని ధుబ్రి నియోజకవర్గం.

20 మే 2014


• బీహార్ రాష్ట్రానికి 23వ ముఖ్యమంత్రిగా జితన్ రామ్ మంజి (జనతాదళ్ యునైటెడ్ పార్టీ) ప్రమాణస్వీకారం
• మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) ఆధారంగా ట్రిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన భారత స్టాక్ ఎక్స్చేంజ్

21 మే 2014

• వాణిజ్య బ్యాంకులు వికలాంగులకు అనుకూలంగా ఉండే ఏటిఎంలను ఏర్పాటుచేయాలని ఆదేశించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ).
• 20:80 పథకం కింద బంగారం దిగుమతుల పై నిబంధనలను సరళతరం చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
• ప్రపంచవ్యాప్తంగా మే 21న అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం నిర్వహణ
• 2014 నేషనల్ జియోగ్రాఫిక్ బీ ఛాంపియన్‌షిప్‌ విజేత అమెరికాలో భారత సంతతి విద్యార్ధి అఖిల్ రేకులపల్లి
• ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ (ఓవిఎల్) మేనేజింగ్ డైరెక్టర్ గా ఎంపికైన నరేంద్ర కుమార్ వర్మ
• వరుసగా నాల్గవసారి ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నవీన్ పట్నాయక్
• రికార్డుస్థాయిలో ఐదోసారి సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కుమార్ చామ్లింగ్ ప్రమాణం
• ఆర్.బి.ఐ యాక్ట్, 1934 రెండవ షెడ్యుల్ లో భాగమైన భారతీయ మహిళా బ్యాంకు
• జమ్మూకాశ్మీర్ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజిపి)గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కే. రాజేంద్రకుమార్ నియామకం

22 మే 2014

• గుజరాత్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ ప్రమాణస్వీకారం
• భారతదేశ నూతన ముఖ్య సమాచార కమీషనర్ (సిఐసి)గా మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ మాథుర్ నియామకం
• ముంబైలో తేలియాడే హోటల్ ఏబి సెలెస్టియల్ ఆవిష్కరణ

23 మే 2014

• తమిళనాడులో 25 సంవత్సరాల తర్వాత పున:ప్రారంభమైన ఓలివ్ రిడ్లీ తాబేళ్ల పరిరక్షణ కార్యక్రమం

24 మే 2014

• శేఖర్ గుప్తా రచించిన యాంటిసిపేటింగ్ ఇండియా – ది బెస్ట్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్ పుస్తకావిష్కరణ
• నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రిగా టి.ఆర్.జేలింగ్ ప్రమాణస్వీకారం

25 మే 2014

• ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కురాలిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మలావత్ పూర్ణ (13 సంవత్సరాల 11 నెలలు) రికార్డు
• భారతదేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్.డి.ఐ) వనరుగా మారిషస్ స్థానంలో చోటు సాధించిన సింగపూర్: డిపార్టుమెంటు ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి) నివేదిక
• 2014లో భారతదేశంలో 15.5 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగిన విదేశీ మారకం నిల్వలు: ఆర్.బి.ఐ అధ్యయనం

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS