Search

ఈ వారం భారత్ : 2 జూన్ 2014 – 8 జూన్ 2014

ఈ వారం భారత్ (2 జూన్ 2014 – 8 జూన్ 2014), వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.

Jun 9, 2014 09:07 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ (2 జూన్ 2014 – 8 జూన్ 2014), వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాలను), విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. జాగరణ్ జోష్ బృందం జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను తేదిల ప్రకారం అందిస్తుంది.

2 జూన్ 2014

• భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం. తెలంగాణా రాష్ట్ర అప్పాయింట్‌మెంట్ డే
• తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాణస్వీకారం
• చైనా తర్వాత రెండవ అతిపెద్ద టెక్స్‌టైల్స్‌ ఎగుమతిదారుగా ఎదిగిన భారత్ : యూఎన్ కాంట్రేడ్ నివేదిక

3 జూన్ 2014
 
• న్యూఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మరణం
• పర్యావరణం పై ది ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (టెరి) ఎన్విరాన్‌మెంట్‌ సర్వే 2014 విడుదల
• ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మహిళల హెల్ప్ లైన్ ను ప్రవేశపెట్టాలని ఆదేశించిన యూపీ ప్రభుత్వం
• ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ కాలాన్ని 60 ఏళ్లకు పెంచిన జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం
• కంపెనీస్ యాక్ట్ 2013 యొక్క కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిబంధనలను అమలు పరచడానికి గ్రాంట్ తోర్న్టన్ తో అవగాహన ఒప్పందం పై సంతకం చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్ కార్పోరేట్ అఫైర్స్ (ఐఐసిఏ)

4 జూన్ 2014
 
• ప్రైవేట్ పాఠశాలలు సమాచార హక్కు చట్టం (ఆర్.టి.ఐ) యాక్టు యొక్క నియమాలను అనుసరించాలి: కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) ఆదేశం
• 16వ లోక్‌సభ ప్రోటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన కమల్ నాథ్
• ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లలో మూడవ స్థానానికి దిగజారిన భారత్, ఆస్ట్రేలియాకు అగ్రస్థానం

5 జూన్ 2014

• ఆర్మీ వెటరన్స్ గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ పోర్టల్ ను ప్రారంభించిన భారత సైన్యం
• మైక్రోమాక్స్ చైర్మన్‌గా సంజయ్ కపూర్ నియామకం
• ఆన్‌లైన్‌ ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్ ను ప్రవేశపెట్టిన కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వశాఖ
• అస్సాంలోని బక్సా జిల్లాలో కృషి విజ్ఞాన్ కేంద్ర ఏర్పాటుకు పరస్పర అవగాహన ఒప్పందం పై సంతకం చేసిన అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఏఆర్)
 
6 జూన్ 2014
 
• 16వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన సుమిత్ర మహాజన్
• పశ్చిమ నావెల్ కమాండ్ కు కమాండర్-ఇన్-చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన అనిల్ చోప్రా
• మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమం మమతా అభియాన్ ప్రచారకర్తగా నియమించబడ్డ మాధురీ దీక్షిత్
• బదావున్ లోని కట్రా గ్రామంలో ఇద్దరు దళిత బాలికల పై అత్యాచారం, హత్య ఉదంతం పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

7 జూన్ 2014
 
• స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరిగే 20వ కామన్వెల్త్ గేమ్స్- (2014)లో జైపూర్ కు చెందిన కవా సంగీత బృంద ప్రదర్శన
• ది ప్రైస్ వి పే (The price we pay)- పొగాకు వ్యతిరేక అడ్వర్టైస్ మెంటును ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

8 జూన్ 2014

• రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం
• ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం పై సుప్రీంకోర్టు నియమించిన ముద్గల్ కమిటీలో సౌరవ్ గంగూలీకి చోటు
• ముంబైలో మెట్రో ట్రైన్ సర్వీసులు ప్రారంభం

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS