Search

ఈ వారం భారత్ : జూలై 21, 2014- జూలై 27, 2014

ఈ వారం భారత్ (జూలై 21, 2014 - జూలై 27, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.

Jul 28, 2014 11:07 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ (జూలై 21, 2014 - జూలై 27, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాలను) విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. జాగరణ్ జోష్ బృందం జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను తేదీల ప్రకారం అందిస్తుంది.

21 జూలై 2014
• లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న దూరదర్శన్ కార్యక్రమం నాద భేద్ ది మిస్టరీ ఆఫ్ సౌండ్
• జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధి నివారణ చర్యలను ఉదృతం చేసిన కేంద్ర ప్రభుత్వం
• పబ్లిక్ సర్వెంట్స్ నియమాలు, 2014ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

22 జూలై 2014
• ఆండ్రాయిడ్ మరియు పర్సనల్ కంప్యూటర్లకు అనువుగా ఉండే గూగుల్ మ్యాప్ లను హిందీ భాషలో ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్
• భారతదేశంలోని బడి పిల్లల కోసం మ్యాగజిన్ ఎక్స్ప్లోరర్ ను ప్రారంభించిన ప్రముఖ అమెరికా సంస్థ నేషనల్ జియోగ్రఫిక్
• తెలంగాణా రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడ్డ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా
• ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 27వ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన రామ్ నాయక్

23 జూలై 2014
• అనుమతి లేని ఈ-రిక్షాలను నిషేధించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
• ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజ్ ట్రేపిజియం జోన్ రక్షిత ప్రాంతంలో 697 చెట్లను నరికివేసేందుకు అనుమతులను ఇచ్చిన సుప్రీంకోర్ట్
• 5 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ కాపిటలైజేషన్ ను అందుకున్న తొలి భారతీయ కంపెనీగా రికార్డు సాధించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టిసీఎస్

24 జూలై 2014
• “బేటి బచావో బేటి పడావో” చైతన్య కార్యక్రమం కోసం లోగో డిజైన్ పోటీని ప్రారంభించిన కేంద్ర మాతా శిశు సంరక్షణ మంత్రిత్వశాఖ
• ఇన్సూరెన్స్ రంగంలో 49 శాతం (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ - ఎఫ్.డి.ఐ) విదేశీ పెట్టుబడులకు అంగీకారం తెలిపిన కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సిసిఈఏ)
• రాష్ట్రపతి ఎస్టేట్ నూతన భవన ప్రాంగణంలో బ్యాంకు మరియు పోస్ట్ ఆఫీసును ప్రారంభించిన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
• పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి 22వ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన కేశారి నాథ్ త్రిపాఠి

25 జూలై 2014
• హర్యానా రాష్ట్రానికి నూతన గవర్నర్ గా నియమించబడ్డ భారతీయ జనతా పార్టీ నేత కాప్టన్ సింగ్ సోలంకి
• కమోడిటీ మార్కెట్లలో కాంప్రిహెన్సివ్ హెడ్జ్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రకటన చేసిన నేషనల్ కమోడిటీ అండ్ డేరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ (ఎన్.సి.డి.ఎక్స్)     
• ముంబాయిలో జరిగిన 5వ సహ్యాద్రి (మరాఠీ సినీ రంగం) సినీ అవార్డుల 2014 వేడుక
• డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ (డి.ఎఫ్.సి) ఏర్పాటుకు పెట్టుబడుల లక్ష్యాన్ని 27000 కోట్ల రూపాయల నుంచి 80000 కోట్ల రూపాయలకు సవరించిన కేంద్ర ప్రభుత్వం
• బొగ్గు స్కాం ఉదంతం పై ఆర్.ఎస్ .చీమాను ప్రత్యేక పబ్లిక్ ప్రోసిక్యుటార్ గా నియమించిన సుప్రీంకోర్ట్

26 జూలై 2014
• మెరుగైన పాలనా యంత్రాంగం కోసం పౌరుల అభిప్రాయాలను సేకరించేందుకు మై గవ్ (MyGov) వెబ్ ప్లాట్ ఫారం ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
• దేశవ్యాప్తంగా జూలై 26వ తేదీన 15వ “కార్గిల్ విజయ్ దివస్” దినోత్సవం నిర్వహణ

27 జూలై 2014
• నేపాల్ లో మూడురోజుల తన పర్యటనను ముగించిన కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS