Search

ఈ వారం భారత్ : జూన్ 23 - జూన్ 29, 2014

ఈ వారం భారత్ (జూన్ 23, 2014 - జూన్ 29, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.

Jun 30, 2014 14:10 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ (జూన్ 23, 2014 - జూన్ 29, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాలను) విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. జాగరణ్ జోష్ బృందం జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను తేదీల ప్రకారం అందిస్తుంది.

23 జూన్ 2014
• భారతదేశంలో బంగ్లాదేశ్ దేశస్థులకు వీసా రహిత ప్రవేశాన్ని రద్దు చేయాలని నిర్ణయించిన కేంద్ర హోం శాఖ
• ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బ్యాంకులు మరియు ఆర్ధిక సంస్థలు సమాచారాన్ని అందించాలని ఆదేశించిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ)
• సంక్షోభంలో ఉన్న చెక్కర మిల్లులకు 4400 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాల మంజూరుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
• తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్.శ్రీనివాసన్
• ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశాల జాబితాలో చోటు సాధించిన గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ పరిరక్షణ ప్రాంతం
• స్టార్ అలయన్స్ గ్రూప్ తో చేతులు కలిపిన ఎయిర్ ఇండియా
• గుజరాత్ లోని సనద్ లో తొలి భారత ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి నివియా కంపెనీ శ్రీకారం
• ప్రభుత్వోద్యోగుల పదవీవిరమణ కాలాన్ని 60 ఏళ్లకు పెంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

24 జూన్ 2014
• ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ మరియు నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లకు నవరత్న హోదాను కల్పించిన కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల మంత్రిత్వశాఖ
• భారతదేశంలో విద్యుత్ రంగంలో సంస్కరణల పై నివేదికను విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు
• స్విట్జర్లాండ్ కు చెందిన ఎల్.జీ.టి బ్యాంకుకు 12.5 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువ గల స్విస్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఆస్తులను విక్రయించిన హెచ్.ఎస్.బి.సి బ్యాంకు
• గుజరాత్ రాష్ట్రంలో పొలీస్ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను ప్రకటించిన గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్
• ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీ విరమణ వయస్సును 68 ఏళ్లకు పెంచిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

25 జూన్ 2014
• బీహార్ లోని చాప్రా వద్ద పట్టాలు తప్పిన ఢిల్లీ-డిబ్రుగడ్ రాజధాని రైలు ఎక్స్‌ప్రెస్
• కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ గా నియమితులైన ఏకే దూబే
• చౌక స్మార్ట్ ఫోన్ల అభివృద్ధి (రూపకల్పన) కోసం ప్రాజెక్ట్ ఆండ్రాయిడ్ వన్ ను ప్రారంభించిన గూగుల్
• ముస్లింలు మరియు మరాఠాలకు రిజర్వేషన్లను పెంచిన మహారాష్ట్ర రాష్ట్ర క్యాబినెట్
• ప్రభుత్వోద్యోగుల పదవీవిరమణ కాలాన్ని 60 ఏళ్లకు పెంచిన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం

26 జూన్ 2014
• కేరళలో జనవరి 31, 2015వ తేదీ నుంచి ఫిబ్రవరి 14, 2015 వరకు 15 రోజుల పాటు జరగనున్న 35వ జాతీయ క్రీడలు, క్రీడల షెడ్యుల్ విడుదల
• అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలి చైర్మన్ గా నియమితులైన ఎన్.శ్రీనివాసన్, ఐసీసీ 11వ అధ్యక్షుడిగా ముస్తఫా కమల్ (బంగ్లాదేశ్)
• దేశంలో తొలిసారిగా దరఖాస్తు ఫారాల్లో థర్డ్ జెండర్ ను జతచేసిన పుణేకు చెందిన ఫెర్గుసన్ కాలేజీ
• తక్కువ ధరకు మందులను అందించే అమ్మా ఫార్మసీలను ఏర్పాటు చేసిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం

27 జూన్ 2014
• ఆంధ్రప్రదేశ్ లోని నగరం గ్రామంలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) పైప్ లైన్ పేలుడుతో 15 మంది మరణం
• ప్రపంచ కప్ సాండ్ స్క్ల్పటింగ్ 2014 పోటీలలో పీపుల్స్ ఛాయిస్ ప్రైజ్ గెల్చుకున్న భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్

28 జూన్ 2014
• ఇరాక్ సంక్షోభంలో చిక్కుకున్న భారత పౌరులకు సాయపడేందుకు చర్యలను వేగవంతం చేసిన భారత ప్రభుత్వం

29 జూన్ 2014
• ఈజిప్ట్ లో ఐబిఎస్ఎఫ్ 6-రెడ్ ప్రపంచ స్నూకర్ టైటిల్ ను గెల్చుకున్న పంకజ్ అద్వానీ
• ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను గెల్చుకున్న సైనా నెహ్వాల్

30 జూన్ 2014
• శ్రీహరికోట నుంచి ఐదు ఉపగ్రహాలతో విజయవంతంగా ప్రయోగించబడ్డ పి.ఎస్.ఎల్.వి సి 23 రాకెట్
• పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ ఎం.కే నారాయణన్ రాజీనామా

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS