Search

ఈ వారం భారత్ : 26 మే 2014 -1 జూన్ 2014

ఈ వారం భారత్ ( 26 మే 2014 – 1 జూన్ 2014), వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.

Jun 2, 2014 14:02 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ ( 26 మే 2014 – 1 జూన్ 2014), వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన అంశాలను విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. విద్యార్ధుల సౌలభ్యం కోసం జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను జాగరణ్ జోష్ బృందం తేదీల ప్రకారం అందిస్తుంది.

26 మే 2014

• భారతదేశానికి 15వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం
• ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం సందర్భంగా భారతదేశానికి వచ్చిన సార్క్ దేశాధినేతలు
• భారతదేశానికి తొలి మహిళా విదేశాంగ మంత్రిగా సుష్మాస్వరాజ్ ప్రమాణస్వీకారం
• నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కొనుగోలు మరియు విలీనం నిబంధనలను కఠినతరం చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

27 మే 2014

• సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా నల్లధనం పై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ను నెలకొల్పిన కేంద్ర క్యాబినెట్
• భారతదేశానికి ఆటోమేటిక్ టాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అందించాలని నిర్ణయించిన మారిషస్
• అస్సాంలో ఖడ్గమృగాల వేట అంశాన్ని విచారించడం కోసం ర్హోడిస్ అనే జన్యుసంబంధ ఫోరెన్సిక్ వ్యవస్థ ఉపయోగం
• పంచాయతీ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఉత్తరాఖండ్ ఎన్నికల సంఘం

28 మే 2014

• సింబెక్స్ 2014ను నిర్వహించిన భారత్-సింగపూర్ నావికాదళాలు
• ఇన్ఫోసిస్ అధ్యక్షుడు, బోర్డు సభ్యుడు బిజి శ్రీనివాస్ రాజీనామా
• విజయవంతంగా ఇంటర్సెప్ట్ డ్ లక్ష్యాలను చేధించిన సూపర్ సోనిక్ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్ళు
• 14వ భారత అటార్నీ జనరల్ గా ముకుల్ రోహాత్గి నియామకం
• ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డ న్రిపేంద్ర మిశ్రా
• జనవరి-ఫిబ్రవరి 2015లో కేరళలో జరిగే  35వ జాతీయ క్రీడలకు గుడ్ విల్ ప్రచారకర్తగా ఎంపికైన సచిన్ టెండూల్కర్
• ట్రెంట్ హైపర్ మార్కెట్లో 50 శాతం వాటా కొనుగోలు చేయాలనుకుంటున్న టెస్కోకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం 
• లుధియానాలో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన పంజాబ్ ప్రభుత్వం

29 మే 2014

• వ్యాస్ సమ్మాన్ 2013 అవార్డును అందుకున్న విశ్వనాథ్ త్రిపాఠి
• సర్వశిక్షా అభియాన్-III కోసం ప్రపంచ బ్యాంకుతో కలిసి ఋణ ఒప్పందం పై సంతకం చేసిన భారత్
• 4000 కోట్ల రూపాయలతో నెట్‌వర్క్ 18లో, 78 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(రిల్)

30 మే 2014
 
• నూతన జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవాల్ నియామకం
• ఉత్తరాఖండ్ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య కార్యక్రమం (యూ.ఆర్.డబ్ల్యూ.ఎస్.ఎస్.పి) కోసం ప్రపంచ బ్యాంకుతో 24 మిలియన్ అమెరికా డాలర్ల విలువ గల క్రెడిట్ అగ్రిమెంట్ పై భారత సంతకం
• మహారాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య కార్యక్రమం (ఎం.ఆర్.డబ్ల్యూ.ఎస్.ఎస్.పి) కోసం ప్రపంచ బ్యాంకుతో 165 మిలియన్ అమెరికా డాలర్ల విలువ గల క్రెడిట్ అగ్రిమెంట్ పై భారత సంతకం
• ఉత్తరాఖండ్ డిసెంట్రలైజ్డ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ (యూ.డి.డబ్ల్యూ.డి.పి) కోసం ప్రపంచ బ్యాంకుతో 121.20 మిలియన్ అమెరికా డాలర్ల విలువ గల క్రెడిట్ అగ్రిమెంట్ పై భారత సంతకం
• గోవా రాష్ట్ర దినోత్సవాన్ని జరుపుకున్న గోవా ప్రభుత్వం

31 మే 2014

• 21 మంత్రుల బృందాలు (జిఓఎం) మరియు 9 సాధికార మంత్రుల బృందాలను (ఈజిఓఎం) లను రద్దు చేసిన నరేంద్ర మోడీ

1 జూన్ 2014

• ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) -7 క్రికెట్ టోర్నమెంట్ టైటిల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్, ఫైనల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై విజయం.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS