Search

ఈ వారం భారత్ : జూలై 28, 2014 – ఆగస్ట్ 3, 2014

ఈ వారం భారత్ (జూలై 28, 2014 – ఆగస్ట్ 3, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.

Aug 4, 2014 15:08 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ (జూలై 28, 2014 – ఆగస్ట్ 3, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాలను) విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. జాగరణ్ జోష్ బృందం జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను తేదీల ప్రకారం అందిస్తుంది.

28 జూలై 2014

• గోవులను శాస్త్రీయంగా సంరక్షించడం కోసం రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకాన్ని, ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
• దేశంలోని అన్ని జిల్లాలో, రేప్ క్రైసిస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఆమోదించిన ఆర్ధిక మంత్రిత్వశాఖ
• 6వ, సి-17 గ్లోబ్ మాస్టర్ III ఎయిర్ క్రాఫ్ట్ ను, పొందిన భారత వైమానిక శాఖ (ఐఏఎఫ్)
• 2014 మ్యాన్ బుకర్ ప్రైజ్ కు షార్ట్ లిస్ట్ అయిన నీల్ ముఖర్జీ పుస్తకం, ది లైవ్స్ ఆఫ్ అదర్స్
• మహారాష్ట్ర రాష్ట్ర ఉద్యానవన ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్
• ఆరు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యుషన్ల, (ఎన్.బి.ఎఫ్.సి) సర్టిఫికేట్ అఫ్ రిజిస్ట్రేషన్ లను రద్దు చేసిన రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్.బి.ఐ).
• ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ నుండి 3వ సైన్స్ ఎక్స్ ప్రెస్ బయోడైవర్సిటీ ప్రత్యేక రైలు ప్రారంభం.
• మణిపూర్ లోని నోనీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం

29 జూలై 2014

• రాష్ట్ర క్యాబినెట్ నుండి రాజీనామా చేసిన హర్యానా విద్యుత్ శాఖ మంత్రి కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్
• కే గిరిప్రకాష్ చే రచించబడ్డ ది విజయ్ మాల్యా స్టొరీ ప్రచురణ

30 జూలై 2014

• తమిళనాడు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టబడిన, టి.ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైవేట్ లా కాలేజ్స్ (నిషేధ) బిల్లు, 2014
• జాతీయ డిప్యూటీ భద్రతా సలహాదారు నెహ్చల్ సంధూ రాజీనామా
• పూణే (మహారాష్ట్ర) లోని మాలిన్ గ్రామంలో, కుండపోత వర్షం కారణంగా కూలిన కొండచరియలు

31 జూలై 2014

• ఆర్మీ స్టాఫ్, చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్
• 2014, అరుణాచల్ ప్రదేశ్ జిల్లా ప్రణాళిక కమిటి (సవరణ) బిల్లును, ఆమోదించిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ
• 2006 మీరట్ అగ్ని ప్రమాదం పై విచారణకు ఏకసభ్య కమిషన్ ను నియమించిన సుప్రీంకోర్టు
• రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియాలో, నాల్గవ డిప్యూటీ గవర్నర్ గా నియమితులైన సుభాష్ షియోరతన్ ముంద్రా (ఎస్.ఎస్.ముంద్రా)
• పురుషుల అథ్లెటిక్స్ విభాగంలో పసిడి పతకాన్ని గెల్చుకున్న వికాస్ గౌడ (కర్ణాటక)
• గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలలో, జిమ్నాస్టిక్స్ విభాగంలో పతకం (కాంస్యం) గెల్చుకోవడం ద్వారా ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్ గా రికార్డు నెలకొల్పిన దీపా కర్మాకర్
• మాపతోన్ 2013తో జాతీయ భద్రతకు హాని కలిగించిందనే కారణంగా, గూగుల్ పై ప్రాధమిక విచారణను నమోదు చేసిన సి.బి.ఐ  
• 2014, ది కోర్ బ్యాంకింగ్ సిస్టం ఇనిషియేటివ్ అవార్డును గెల్చుకున్న భారతీయ మహిళా బ్యాంకు లిమిటెడ్
• 22వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డుకు ఎంపికైన చిత్ర దర్శకుడు, కవి ముజాఫర్ అలీ

1 ఆగస్ట్ 2014

• క్రిమినల్ న్యాయ వ్యవస్థను పటిష్టం (ఫాస్ట్-ట్రాక్) చేసేందుకు, ప్రతిపాదనలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు
• ఆస్తుల అమ్మకపు సంప్రదింపుల కోసం తీహార్ జైలులో కాన్ఫెరెన్స్ గదిని వాడుకునేందుకు సుబ్రతా రాయ్ కి అనుమతిని ఇచ్చిన సుప్రీంకోర్టు

2 ఆగస్ట్ 2014

• ఈస్ట్ బెంగాల్ క్లబ్ నుంచి “భారత్ గౌరవ్” సత్కారాన్ని అందుకున్న బచేంద్రి పాల్

3 ఆగస్ట్ 2014

• రోల్స్ రాయస్ తో కలిసి వ్యాపారం చేసేందుకు రక్షక దళాలకు (ఆర్మ్డ్ ఫోర్సెస్) అనుమతిని ఇచ్చిన కేంద్ర రక్షణా మంత్రిత్వశాఖ
• కామన్వెల్త్ క్రీడలలో, స్వర్ణ పతకాన్ని గెలుపొందిన మూడవ భారత బాడ్మింటన్ క్రీడాకారుడిగా గుర్తింపు సాధించిన పారుపల్లి కశ్యప్.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS