Search

ఈ వారం భారత్ : జూన్ 30, 2014 - జూలై 6, 2014

ఈ వారం భారత్ (జూన్ 30, 2014 - జూలై 6, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది

Jul 7, 2014 09:05 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ (జూన్ 30, 2014 - జూలై 6, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాలను) విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. జాగరణ్ జోష్ బృందం జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను తేదీల ప్రకారం అందిస్తుంది.

30 జూన్ 2014
• శ్రీహరికోట నుంచి ఐదు ఉపగ్రహాలతో విజయవంతంగా ప్రయోగించబడ్డ పి.ఎస్.ఎల్.వి సి 23 రాకెట్
• పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ ఎం.కే నారాయణన్ రాజీనామా
• జమ్మూకాశ్మీర్ లోని లెహ్ లో జరిగిన మూడవ విడత లడఖ్ అంతర్జాతీయ చిత్రోత్సవం
• అంధులకు తోడ్పాటును అందించే మరకేష్ ఒడంబడికను ఆమోదించిన తొలి దేశంగా నిలిచిన భారత్
• రాష్ట్ర జంతువుగా ఒంటెను ప్రకటించిన రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం

1 జూలై 2014
• భారతదేశంలో 47వ టైగర్ రిజర్వుగా మహారాష్ట్రలోని బోర్ వన్యప్రాణి సంరక్షణాలయము  
• సూక్ష్మబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో చేరిన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
• 2011 నేషనల్, శిల్ప్ గురు మరియు సంత్ కబీర్ అవార్డులను అందజేసిన భారత అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ
• దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహణ
• పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరిలో భారత పిస్టల్ షూటర్ జితూ రాయ్ కి అగ్రస్థానం  
• ఛత్తీస్ గడ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా రామ్ నరేష్ యాదవ్ ప్రమాణస్వీకారం

2 జూలై 2014
• ఫస్ట్ సిటిజెన్: ప్రణబ్ ముఖర్జీ ఇన్ రాష్ట్రపతి భవన్ అనే కాఫీ టేబుల్ పుస్తకావిష్కరణ
• తెలంగాణా రాష్ట్ర శాసనమండలి తొలి చైర్మన్ గా ఎన్నికైన స్వామి గౌడ్

3 జూలై 2014
• ఢిల్లీ-ఆగ్రా స్టేషన్ల మధ్య సెమీ హైస్పీడ్ ట్రైన్ ట్రయిల్ రన్ ను విజయవంతంగా పరిశీలించిన భారతీయ రైల్వే
• అస్సాంలో విద్యుత్ రంగ అభివృద్దికి 300 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణాన్ని అందించడానికి ఆమోదం తెలిపిన ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడిబి), మనీలా
• చెన్నైలో జరిగిన భవన ప్రమాదం పై విచారణకు రఘుపతి కమిషన్ ను నియమించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం

4 జూలై 2014
• పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలను స్వీకరించిన బీహార్ రాష్ట్ర గవర్నర్ డి.వై పాటిల్
• గోవా రాష్ట్ర గవర్నర్ బివి వాంచూ రాజీనామా
• ఉధంపూర్ కాట్రా రైల్ లైను (జమ్మూకాశ్మీర్) ను ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ
• జమ్మూకాశ్మీర్ లో 240 మెగావాట్ల ఉరి -II హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
• ఆరవల్లి పర్వతాలలో అక్రమ మైనింగ్ ను నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్ట్

5 జూలై 2014
• సంక్షోభంలో ఉన్న ఇరాక్ లోని ఎర్బిల్ నుంచి 46 మంది భారత నర్సులతో పాటు మరో 137 మంది ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం ద్వారా కొచ్చి (కేరళ) చేరుకున్నారు.

6 జూలై 2014
• గుజరాత్ రాష్ట్ర గవర్నర్ కమ్లా బేనివాల్ కు స్థానచలనం, మిజోరాం రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతల స్వీకరణ
• స్ట్రైక్ చేస్తున్న వైద్య అధికారులను ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ (ఎస్మా) యాక్ట్ ద్వారా పిలిచిన మహారాష్ట్ర ప్రభుత్వం

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS