Search

ఈ వారం భారత్ : ఆగస్ట్ 4, 2014 – ఆగస్ట్ 10, 2014

ఈ వారం భారత్ (ఆగస్ట్ 4, 2014 – ఆగస్ట్ 10, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.

Aug 11, 2014 14:07 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ (ఆగస్ట్ 4, 2014 – ఆగస్ట్ 10, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాలను) విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. జాగరణ్ జోష్ బృందం జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను తేదీల ప్రకారం అందిస్తుంది.

 4 ఆగస్ట్ 2014

• దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్రూణహత్యలను అరికట్టడం కోసం తీసుకున్న చర్యల సమాచారాన్ని అందజేయాలని కోరిన సుప్రీంకోర్టు
• జాతీయ డిప్యూటీ భద్రతా సలహాదారుగా నియమించబడ్డ మాజీ ఐఎఫ్ఎస్ అధికారి అరవింద్ గుప్తా
• నేపాల్ పర్యటనకు వెళ్ళిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.
• 2014 కామన్వెల్త్ క్రీడలలో లైంగిక వేధింపుల ఆరోపణల పై రెస్లింగ్ రిఫరీ, వీరేందర్ మాలిక్ ను, సస్పెండ్ చేసిన రెస్లింగ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ).

5 ఆగస్ట్ 2014

• దమన్ సింగ్ రచించిన స్ట్రీక్ట్లీ పర్సనల్, మన్మోహన్ అండ్ గురుశరణ్ ప్రచురణ
• ఢిల్లీ మరియు గుర్గావ్ మధ్య కారిడార్ ఆఫ్ లైఫ్ టు ట్రాన్స్ పోర్ట్ ఆర్గాన్స్ ఏర్పాటు
• కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ డాక్టర్ మంజులా చెల్లుర్

6 ఆగస్ట్ 2014

• చాచ చౌధురి పాత్ర సృష్టికర్త ప్రాన్ (75) కన్నుమూత
• పశ్చిమాఫ్రికా నుండి వచ్చే ప్రయాణికులను స్క్రీనింగ్ చేయటం కోసం ఎబోలా చెక్ పోస్ట్లను ఏర్పాటు చేయాలనీ కోరిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
• రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని, 26 శాతం నుండి 49 శాతానికి పెంచిన కేంద్ర క్యాబినెట్

7 ఆగస్ట్ 2014

• లోక్ సభలో, రెండు కార్మిక సంస్కరణ బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
• ద్రోణాచార్య అవార్డు ఎంపిక కమిటీకి అధ్యక్షత వహించనున్న, మాజీ భారత హాకీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్
• అర్జున అవార్డుల ఎంపిక కమిటీకి అధ్యక్షత వహించనున్న మాజీ భారత క్రికెటర్ కపిల్ దేవ్

8 ఆగస్ట్ 2014

• రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటును, ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం
• సిలికా డస్ట్ వినియోగించే పరిశ్రమల పై కమిటీని ఏర్పాటు చేసిన, ఉత్తరాఖండ్ ప్రభుత్వం  

9 ఆగస్ట్ 2014

• గుజరాత్స్ సక్సెస్ స్టొరీ ఇన్ వాటర్ మేనేజ్మెంట్, అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోడీ
• బంగ్లాదేశ్ పై 3-0 ఆధిక్యంతో విజయం సాధించి, సిరీస్ ను గెల్చుకున్న భారత పురుషుల హాకీ జట్టు

10 ఆగస్ట్ 2014

• కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నూతన చైర్మన్ గా నియమించబడిన కే వి చౌదరి
• అవినీతిని అణిచివేసేందుకు వాట్స్అప్ హెల్ప్ లైన్ ను ప్రారంభించిన ఢిల్లీ పోలీస్ శాఖ

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS