Search

ఈ వారం భారత్ : జూలై 7, 2014 - జూలై 13, 2014

ఈ వారం భారత్ (జూలై 7, 2014 - జూలై 13, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది

Jul 15, 2014 12:08 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ (జూలై 7, 2014 - జూలై 13, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాలను) విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. జాగరణ్ జోష్ బృందం జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను తేదీల ప్రకారం అందిస్తుంది.

7 జూలై 2014
• రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులైన ఎం.ఎస్.మెహతా
• భారతీయ రైల్వేల కోసం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ను ప్రారంభించిన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ
• షరియత్ కోర్టులు చట్టవిరుద్ధమని తెలిపిన సుప్రీంకోర్ట్
• ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్ లలో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించిన సానియా మీర్జా, డబ్ల్యూటిఏ డబుల్స్ ర్యాంకింగ్ లలో ఐదవ స్థానం

8 జూలై 2014
• 2015 సంవత్సరం కల్లా కాలా అజర్ వ్యాధిని తరిమికొట్టేందుకు కోర్ గ్రూప్ ను రూపొందించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
• ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2013 నివేదికను విడుదల చేసిన కేంద్ర పర్యపరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ (స్వతంత్ర హోదా)
• బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించిన భారత్
• కేంద్ర రైల్ బడ్జెట్ 2014-15 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే మంత్రి సదానంద్ గౌడ

9 జూలై 2014
• ఉత్తర భారతదేశంలో భూగర్భజలాల అధ్యయనం కోసం పరస్పర అవగాహనా ఒప్పందం పై సంతకం చేసిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (సి.జీ.డబ్ల్యూ.బి) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఐఐఆర్ఎస్
• ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా 2013-14 నివేదిక విడుదల

10 జూలై 2014
• మేటి నటి జోహ్రా సెహగల్ (102) మృతి
• పార్లమెంటులో తొలిసారి వార్షిక (2014-14) కేంద్ర బడ్జెటును ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ

11 జూలై 2014
• గ్లోబల్ ఎయిర్ లైన్ గ్రూప్, స్టార్ అల్లయన్స్ తో జతకలిసిన దేశీయ విమానయాన ఎయిర్ ఇండియా

12 జూలై 2014
• పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి యాంటి సబ్ మెరైన్ వార్ షిప్ ఐఎన్ఎస్ కమ్రోటను భారత నావికాదళానికి అప్పగించిన భారత ప్రభుత్వం

13 జూలై 2014
• ప్రమాదవశాత్తు ఐఎన్ఎస్ కుతార్ వార్ షిప్ ధ్వంసం, ఆగస్ట్ 2013 నుంచి 15వ దుర్ఘటన
• సీనియర్ విహెచ్.పి లీడర్ గిరిరాజ్ కిషోర్ (94) కన్నుమూత
• జూలై 24 నుంచి అండమాన్ & నికోబార్ కు ఇంటర్ ఐలాండ్ ఎయిర్ సర్వీస్ మొదలు  
• వార్షిక నికర ఆదాయంలో 9.48 శాతం పెరుగుదలను నమోదు చేసిన భారతీయ రైల్వేలు

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS