Search

ఈ వారం భారత్ : 9 జూన్ 2014 –15 జూన్ 2014

ఈ వారం భారత్ (9 జూన్ 2014 – 15 జూన్ 2014), వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.

Jun 18, 2014 13:12 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ (9 జూన్ 2014 – 15 జూన్ 2014), వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన (కరెంట్ అఫైర్స్) వర్తమాన అంశాలను జాగరణ్ జోష్ బృందం జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో తేదిల ప్రకారం అందించడం జరిగింది.

9 జూన్ 2014

• దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న అభ్యర్ధులకు ఉద్యోగాలలో 12 శాతం రిజర్వేషన్ ను ఇవ్వాలని ప్రకటించిన సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం
• పెట్టుబడుల క్రెడిట్ ను పెంచడానికి రిఫైనాన్స్ రేట్లను తగ్గించిన నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)
• బ్యాంకు ఖాతా తెరవడంలో నో యువర్ కస్టమర్ (కేవైసి) నిబంధనలను సులభతరం చేసిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా
• ముళ్ళపెరియార్ డ్యాం అంశంలో కేంద్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వం ఉండాలని తీర్మాణం చేసిన కేరళ క్యాబినెట్
• హెచ్ఐవీ నిరోధక సేవలను ప్రవేశపెట్టడానికి అవగాహనా ఒప్పందం పై సంతకం చేసిన కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ మరియు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ
• కార్వార్ లో సీబర్డ్ ఫేజ్ II ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులను పొందిన కర్ణాటక
• 2013 భారతరత్న జేఆర్.డీ టాటా అవార్డును అందుకున్న ఎయిర్ నావిగేషన్ సర్వీస్ సభ్యుడు వి.సోమసుందరం
• ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డ డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా
• ఐఎన్ఎస్ కోల్‌కతా నౌక నుంచి విజయవంతంగా ప్రయోగించబడ్డ సూపర్సోనిక్ క్రూజ్ మిస్సైల్ బ్రహ్మోస్

10 జూన్ 2014

• అమెరికాలోని న్యూయార్క్ లో నూతన విదేశీ బ్యాంకు శాఖను ప్రారంభించిన కెనరా బ్యాంకు
• మహాత్మాగాంధీ తొలిసారిగా సత్యాగ్రహం చేసిన టాల్స్టాయ్ ఫార్మ్(దక్షిణాఫ్రికా)ను పునరుద్ధరించడానికి కోటి రూపాయల విరాళమిచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
• తెలంగాణా రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా నియమితులైన సిరికొండ మధుసూధనా చారి
• రిలయన్స్ INFOCOMఇన్ఫోకాం అధ్యక్షుడిగా నియమించబడ్డ సునీల్ దత్
• నాలుగు స్టాండింగ్ కమిటీ కాబినెట్లను రద్దు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ
• భారత్ సంతృప్తికరమైన ఆర్ధికవృద్ధిని సాధిస్తుంది : ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసిడి) నివేదిక
• నిన్నటితరం బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ జీవితగాధ పై ఉదయ తారా నాయర్ రచించిన ది సుబ్స్తాన్స్ అండ్ ది షాడో పుస్తకావిష్కరణ

 11 జూన్ 2014
 
• ఆళ్వార్, పానిపట్ మరియు మీరట్ పట్టణాలకు రాపిడ్ రైల్ లింకుకై ఆమోదం తెల్పిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్
• మధ్య తూర్పు అరేబియా మహాసముద్రంలో సంభవించిన ననౌక్ ట్రాపికల్ తుఫాను
• మ్యూనిచ్ షూటింగ్ ప్రపంచ కప్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజత పతకాన్ని గెల్చుకున్న జితు రాయ్
• రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్.ఆర్.టి.ఎస్) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం
• ఇన్ఫోసిస్ కంపెనీ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈఓ)గా నియమితులైన విశాల్ సిక్కా
• జూన్ 9 నుండి జూన్ 11,2014 మధ్య గైర్సైన్ లో తొలిసారి డెహ్రాడూన్ బయట జరిగిన ఉత్తరాఖండ్ శాసనసభ సమావేశం

12 జూన్ 2014

• సర్దార్ సరోవర్ డ్యాం ఎత్తు పెంపు కోసం నర్మదా కంట్రోల్ అథారిటీ (ఎన్.సి.ఏ) అనుమతులను పొందిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం
• 2014 ఫిఫా ప్రపంచ కప్ సందర్భంగా పోస్టేజ్ స్టాంపులను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
• యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ది లిమిట్స్ ఆఫ్ కాంటినెంటల్ షెల్ఫ్(యూ.ఎన్.సి.ఎల్.సి.ఎస్)కి ఎన్నికైన భారత శాస్త్రవేత్త రసిక్ రవీంద్ర
• జమ్మూకాశ్మీర్ లోని లెహ్ ప్రాంతంలో ప్రారంభమైన మూడురోజుల (జూన్ 12 నుండి జూన్ 15, 2014) లెహ్ ఉత్సవం

13 జూన్ 2014

• థానే జిల్లా విభజనకు అంగీకరించిన మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర 36వ జిల్లాగా పల్ఘర్
• హిమాచల్ ప్రదేశ్ లో రాంపూర్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు వద్ద 68 మెగావాట్ల సామర్ధ్యం గల యూనిట్ ను ఏర్పాటుచేసిన భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిహెచ్ఈఎల్)
• వాషింగ్టన్ ఒప్పందం (అకార్డ్) లో శాశ్వత సంతకం చేసిన భారత్
• ప్రతిష్టాత్మక మూర్తిదేవి సాహిత్య అవార్డు 2013 కు ఎంపికైన మలయాళ రచయిత సి.రాధాకృష్ణన్
• జోధ్పూర్ లో ముగిసిన ఇండో ఫ్రెంచ్ ఎయిర్ ఎక్సర్సైజ్ గరుడ V
• స్ట్రాటెజిక్ ఫోర్సెస్ కమాండ్, కమాండర్ ఇన్ చీఫ్ గా నియమించబడ్డ లెఫ్టినెంట్ జనరల్ అమిత్ శర్మ
• భారత ఉపప్రధాని హమీద్ అన్సారీకి టివి పాల్ రచించిన వారియర్ స్టేట్ పుస్తకం బహుకరణ

14 జూన్ 2014
 
• అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ మురళీ కార్తిక్
• నూతన రెవెన్యూ కార్యదర్శిగా నియమితులైన శక్తికాంత దాస్
• ఐఎన్ఎస్ విక్రమాదిత్యను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

15 జూన్ 2014

• ఢిల్లీలోని ద్వారకా సెక్టర్ 21 మెట్రో స్టేషన్ వద్ద తొలి రూఫ్ టాప్ సౌరశక్తి ప్లాంటును ప్రారంభించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సీ)
• తొలిసారిగా భారతదేశ ప్రధానిగా భూటాన్ కు విదేశీపర్యటనకు వెళ్ళిన నరేంద్ర మోడీ

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS