Search

ఈ వారం భారత్ : జూలై 14, 2014- జూలై 20, 2014

ఈ వారం భారత్ (జూలై 14, 2014 - జూలై 20, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది.

Jul 22, 2014 13:05 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఈ వారం భారత్ (జూలై 14, 2014 - జూలై 20, 2014) వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్దుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినది. జాతీయ స్థాయిలో జరిగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ (వర్తమాన అంశాలను) విద్యార్ధులు సులువుగా గుర్తించుకునే రీతిలో అందించడం జరిగింది. జాగరణ్ జోష్ బృందం జాతీయ, ఆర్ధిక, కార్పొరేట్, క్రీడా రంగాలలో ముఖ్యమైన అంశాలను తేదీల ప్రకారం అందిస్తుంది.

14 జూలై 2014
• హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) లో నేషనల్ సెంటర్ ఫర్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ బల్క్ డ్రగ్స్ ఏర్పాటు
• మహిళల సంరక్షణ కోసం 320 మహిళా సురక్ష దళాలను ఏర్పాటు చేయనున్న ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం
• సెప్టెంబర్ 1, 2014 నుంచి జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించిన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం
• జూన్ 2014లో 30 నెలల కనిష్టానికి (7.31 శాతం) దిగజారిన దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం

15 జూలై 2014
• మౌలికరంగ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ నార్మ్స్ లను సరళతరం చేసిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ)
• అక్టోబర్ 2014లో గోవాలో జరగనున్న 127వ డ్యురాండ్ కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్
• గాంధీ శాంతి బహుమతి 2013ని అందుకున్న పర్యావరణ ఉద్యమకర్త చండీప్రసాద్ భట్

16 జూలై 2014
• రెండురోజుల (జూలై 15-16) 6వ బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోడీ
• గుజరాత్ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణం చేసిన ఓం ప్రకాష్ కోహ్లి
• ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) నూతన చైర్మన్ గా పదవీ బాధ్యతలను చేపట్టిన బి అశోక్
• గారో లేబర్ కార్ప్స్ దినోత్సవాన, మొదటి ప్రపంచయుద్ధ వీరులను గౌరవించిన మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం
• లురేయస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీ సభ్యుడిగా ఎన్నికైన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్

17 జూలై 2014
• మౌలికరంగ పెట్టుబడుల ట్రస్టుల కోసం డ్రాఫ్ట్ మార్గదర్శకాలను జారీ చేసిన సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి)
• నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2013ను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
• పేమెంట్ బ్యాంకులు మరియు చిన్న బ్యాంకుల లైసెన్సింగ్ కోసం డ్రాఫ్ట్ మార్గదర్శకాలను విడుదల చేసిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ)

18 జూలై 2014
• మెగా ఫుడ్ పార్కుల నిర్మాణం కోసం నాబార్డుకు 200 కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
• ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ 2014-15ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ
• నిథారీ హత్య కేసు ప్రధాన నిందితుడు సురీందర్ కోలి మరియు మరో ఐదుగురి మరణశిక్ష క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

19 జూలై 2014
• ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్ఆర్ఎఫ్) పనితీరులో గుణాత్మక మార్పులను సూచించిన ప్రధాని నరేంద్ర మోడీ
• కాస్ట్ రికార్డులు మరియు కాస్ట్ ఆడిట్ల పై ఆర్.ఎస్.శర్మ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు

20 జూలై 2014
• ఛత్తీస్‌గడ్‌లో ఏలియన్లు మరియు అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ అబ్జెక్ట్స్ (యూఎఫ్ఓ) లను సూచించే ప్రి హిస్టారిక్ (చారిత్రక) రాతి పెయింటింగ్ లను కనుగొన్న పురావస్తు చరిత్రకారులు (ఆర్కియాలజిస్టులు)
• లోక్ పాల్, లోకాయుక్తల చట్టం 2013ను అనుసరించి పబ్లిక్ సర్వెంట్స్ రూల్స్ 2014ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS