Search

అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌లో భారత బృందానికి ఏడు పతకాలు

2014 ఏప్రిల్ 26, 27 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో భారత జిమ్నాస్టులు ఏడు పతకాలు కైవసం చేసుకున్నారు.

Apr 30, 2014 11:00 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో 2014 ఏప్రిల్ 26, 27 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్  ఛాంపియన్‌షిప్‌లో భారత జిమ్నాస్టులు ఏడు పతకాలు కైవసం చేసుకున్నారు. వీటిలో మూడు పసిడి పతకాలతో పాటు మూడు రజత పతకాలు, మరో కాంస్య పతకం ఉన్నాయి.
 
2010లో జరిగిన కామన్వెల్త్ క్రీడలతో పాటు, ఆసియా క్రీడల్లో పతకాలు గెలుచుకున్న ఆశిష్ కుమార్, ప్రస్తుతం భారత్‌కు రెండు స్వర్ణ పతకాలను (ఫ్లోర్ ఎక్సర్ సైజ్ వాల్ట్ విభాగాలలో), మరో రెండు రజత పతకాలను అందించగా, మహిళా జిమ్నాస్టు దీపా కర్మాకర్ ఒక పసిడి పతకంతో పాటు మరో రజత పతకాన్ని అందించింది. కాగా, పురుషుల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టీమ్ ఈవెంట్‌లో ఆశిష్, రాకేష్ పత్రా, అభిజీత్ షిండే, సంజయ్ బర్మన్, చందన్ పాథక్ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS