Search

2015-16 భారత రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తొలిసారి లోక్ సభలో 26 ఫిబ్రవరి 2015న  2015-16 రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Feb 26, 2015 13:12 IST
facebook IconTwitter IconWhatsapp Icon

Railway Budget 2015-16కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తొలిసారి లోక్ సభలో 26 ఫిబ్రవరి 2015న  2015-16 రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పరిశుభ్రత, రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ, రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని సురేశ్ ప్రభు తెలిపారు.

రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు
• రైళ్ల రాకపోకలపై ఎస్ ఎంఎస్ సదుపాయం
• తక్కువ ధరకే తాగునీరు
• సాధారణ బోగీల్లో మొబైల్ ఛార్జింగ్ సదుపాయం
• రాజధాని ఎక్స్ ప్రెస్ ల వేగాన్ని పెంచేందుకు కృషి
• రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాల సహకారం తీసుకుంటాం
• రైళ్లలో నాణ్యమైణ ఆహారం అందించేందుకు కృషి
• ఆరు నెలల్లో 17వేల బయో టాయిలెట్స్ నిర్మాణం
• ప్రయాణికులు అయిదు నిమిషాల్లో టిక్కెట్ పొందే  ఏర్పాటు
• 650 స్టేషన్లలో కొత్తగా టాయిలెట్స్ నిర్మాణం
• రైళ్లలో బయో టాయిలెట్స్ నిర్మాణం
• రైళ్లల్లో మహిళా భద్రతకు  టోల్ ఫ్రీ నెంబర్ 182
• బ్యాంకులు, పెన్షన్ నిధులను పెట్టుబడులకు ఉపయోగిస్తాం
• రైల్వేల అభివృద్ధికి అయిదేళ్ల యాక్షన్ ప్లాన్
• వచ్చే అయిదేళ్లలో రైల్వేల్లో రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులు
• ఛార్జీలు పెంచే యోచన లేదు
• ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించటమే ప్రధాన లక్ష్యం
• రైల్వే టిక్కెట్ ధరలు పెంచటం లేదు
• కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో ప్రయివేట్ భాగస్వామ్యం
• వచ్చే అయిదేళ్లలో రైల్వేలో రూ.8.5 కోట్లు పెట్టుబడులు
• ప్యాసింజర్ రైళ్ల స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు పెంచలేమా?
• రైల్వేలపై ప్రజలు భారీ అంచనాలతో ఉన్నారు
• ఉన్నత భవిష్యత్ లక్ష్యంగా రైల్వే బడ్జెట్ వచ్చింది
• శతాబ్ధి ఎక్స్ ప్రెస్ ను గంటకు 125 కిలోమీటర్లు పెంచలేమా?
• రాజధాని, శతాబ్ధి రైళ్లు అనుకున్న విధంగా నడవటం లేదు
• పాతవాటిని తొలగించాలి...కొత్తవి నడపాలి
• కాలం చెల్లిన రైళ్లను నడపాల్సి వస్తోంది
• పెండింగ్ ప్రాజెక్ట్ లకు పూర్తికి  ప్రాధాన్యత
• భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన
• రైల్వే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక
• దేశాభివృద్ధిలో రైల్వేలదే కీలక పాత్ర
• రైల్వేల మీద ఇటీవల ఒత్తిడి పెరిగింది
• అంచనాల భారం రైల్వేపై ఎక్కువగా ఉంది
• రైల్వేలు ఆర్థికంగా వృద్ధి చెందాల్సి ఉంది
• పెట్టుబడులు పెరిగితే ఉద్యోగాలు వస్తాయి
• ప్రజల మద్దతుతో రైల్వేలు మరింత అభివృద్ధి
• పర్యావరణ హితమైన అభివృద్ధే రైల్వేల లక్ష్యం
• గతంలో అనుకున్న రీతిలో రైల్వేలు అభివృద్ధి చెందలేదు

 

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS