Search

విశ్వవ్యాప్తంగా ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం నిర్వహణ

ప్రపంచవ్యాప్తంగా మే 22, 2014ను ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవంగా జరుపుకున్నారు.

May 24, 2014 19:02 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం – మే 22

ప్రపంచవ్యాప్తంగా మే 22, 2014ను ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవంగా జరుపుకున్నారు. జీవివైవిధ్య పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ఈ దినోత్సవాన్ని పాటిస్తారు. 2014 జీవవైవిధ్య దినోత్సవ థీమ్ (ఇతివృత్తం) ఐలాండ్ బయోడైవర్సిటీ (జీవవైవిధ్యం).

గ్రామాలు మరియు ద్వీపాలలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం ఈ రోజును జరుపుకుంటారు.

జీవవైవిధ్య దినోత్సవం గురించి

• తొలుత 1993 నుండి 2000 వరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, జీవవైవిధ్య సమావేశం జరిగిన డిసెంబర్ 29వ తేదీన జీవవైవిధ్య దినోత్సవాన్నిజరుపుతుండేది.
• ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2000లో మే 22ను ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవంగా మార్చింది. మే 22, 1992న నైరోబి ఒప్పంద సమావేశంలో ఆమోదించబడిన అంశాలను అనుసరించి ఆ సందర్భానికి గుర్తుగా అప్పటినుంచి మే 22ను ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవంగా జరపడం ప్రారంభించారు. 
• జీవవైవిధ్య అంశాల పై చైతన్యం మరియు అవగాహనను పెంచడం కోసం ఈ దినోత్సవాన్ని జరుపుతారు.

2013 ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవ థీమ్: వాటర్ అండ్ బయోడైవర్సిటీ (Water and Biodiversity)

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS