Search

ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం నిర్వహణ

21 ఫిబ్రవరి 2015న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం నిర్వహించారు.

Feb 24, 2015 14:11 IST
facebook IconTwitter IconWhatsapp Icon

21 ఫిబ్రవరి 2015న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం నిర్వహించారు. 2015 సంవత్సరానికి ‘ఇంక్లుసివ్ ఎడ్యుకేషన్ త్రు అండ్ విత్ లాంగ్వేజ్- లాంగ్వేజ్ మేటర్స్’ అనే థీమ్ తో నిర్వహించారు.

2015 సంవత్సరం అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం యొక్క 15వ వార్షికోత్సవంగా ఉంది.

భాషాపరమైన మరియు సాంస్కృతిక వైవిధ్యం మరియు బహుభాషితాన్ని ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 2000 నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.

అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవంను నవంబర్ 1999 లో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) సాధారణ సమావేశం ద్వారా ప్రకటించారు.

1952లో అప్పటి పాకిస్థాన్ యొక్క రెండవ జాతీయ భాషగా తమ భాష ‘బంగ్లా’ను గుర్తించాల్సిందిగా పోరాటం చేసిన ఇద్దరు బంగ్లాదేశ్ యువకులను ఇప్పటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కాల్చి చంపిన రోజుకు గుర్తుగా ఈ ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటారు.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS