1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. అంతర్జాతీయం | ప్రపంచం

అంతర్జాతీయం | ప్రపంచం

ఐటి & ఎలక్ట్రానిక్స్ రంగాలలో సహకారం కోసం భారతదేశం మరియు జోర్డాన్ మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం

Jan 5, 2016
కేంద్ర మంత్రివర్గం 30 డిబసెంర్ 2015 న సమాచార సాంకేతిక మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో సహకారం కోసం భారతదేశం మరియు జోర్డాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) ను ఆమోదించింది.

కమోవ్ 226T హెలికాప్టర్ల తయారీకి హెచ్ఎఎల్ తో రష్యా ఒప్పందం

Dec 31, 2015
29 డిసెంబర్ 2015 న రష్యా యొక్క రోస్టెక్ స్టేట్ కార్పొరేషన్ సుమారు 200 కమోవ్ 226T కాంతి హెలికాప్టర్ల తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) తో ఒప్పందం కుదుర్చుకుంది. కమోవ్, పురాతనమైన చీతా మరియు చేతక్ విమానాలను భర్తీ చేస్తుంది.

ప్రపంచంలో మొట్టమొదటి డెంగ్యూ టీకాను ఆమోదించిన మొదటి ఆసియా దేశంగా ఫిలిప్పీన్స్

Dec 28, 2015
ఫిలిప్పీన్స్ 22 డిసెంబర్ 2015 న ప్రపంచంలో మొట్టమొదటి డెంగ్యూ టీకా డెంగ్వాక్సియా మార్కెటింగ్ కోసం ఆమోదం తెల్పిన తొలి ఆసియా దేశంగా మారింది.

చైనా లోని జెంగ్జౌ లో ముగిసిన 14వ ఎస్సిఓ సభ్య దేశాల ప్రధాన మంత్రుల సమావేశం

Dec 21, 2015
షాంఘై సహకార సంస్థ రెండు రోజుల షాంఘై సహకార సంస్థ (సీఎస్ఓ) సభ్య దేశాల ప్రధాన మంత్రుల కౌన్సిల్ సమావేశం 15 డిసెంబర్ 2015 న ముగిసింది.

తపి గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పని ప్రారంభం

Dec 18, 2015
తపి నిర్మాణ పని తపి (తుర్క్మెనిస్తాన్-ఆఫ్గనిస్తాన్-పాకిస్తాన్-భారతదేశం) గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు నిర్మాణ పని 13 డిసెంబర్ 2015 న తుర్క్మెనిస్తాన్ లో ప్రారంభమైంది.

రైల్వే రంగంలో సహకారం కోసం మూడు ఒప్పందాలు కుదుర్చుకున్న భారతదేశం మరియు జపాన్

Dec 14, 2015
భారతదేశం మరియు జపాన్ 12 డిసెంబర్ 2015 న ముంబై - అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ (బుల్లెట్ రైలు ప్రాజెక్టు) కోసం సహకారం మరియు సహాయార్థం ఒక అవగాహనా ఒప్పందం (MoU) పై సంతకాలు చేశాయి.

మయన్మార్ యాంగన్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రారంభోత్సవం

Dec 14, 2015
9 డిసెంబర్ 2015 న మయన్మార్, మార్చి 2016 లో వాణిజ్యం ప్రారంభం చేయునున్న ఆరు కంపెనీల కోసం ప్రణాళికలతో యాంగన్ స్టాక్ ఎక్స్చేంజ్ (వైఎస్ఎక్స్) అనే కొత్త స్టాక్ ఎక్స్ఛేంజ్ ను ప్రారంభించింది.

అర్జెంటీనా అధ్యక్షుడిగా మారిషియో మక్రి బ్లాంకో ప్రమాణస్వీకారం

Dec 11, 2015
మారిషియో మక్రి బ్లాంకో 10 డిసెంబర్ 2015 న అర్జెంటీనా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అతను 2007 మరియు 2015 మధ్య రెండు పర్యాయాలు కార్యాలయంలో అధ్యక్షుడిగా వ్యవహరించిన క్రిస్టినా ఎలిసాబెట్ ఫెర్నాండెజ్ డి కిర్ఖేర్ స్థానంలో అధ్యక్షుడిగా నిలిచారు.

2015 వెనిజులా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ యూనిటీ రౌండ్ టేబుల్ పార్టీ విజయం

Dec 9, 2015
6 డిసెంబర్ 2015న వెనిజులా పార్లమెంటుకి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ యూనిటీ రౌండ్ టేబుల్ (ఎంయుడి) పార్టీ మెజారిటీ సీట్లలో విజయం సాధించింది.

లాట్వియా ప్రధాని లైండోటా స్త్రౌజుమా రాజీనామా

Dec 8, 2015
7 డిసెంబర్ 2015న లాట్వియా యొక్క మొదటి మహిళా ప్రధాన మంత్రి లైండోటా స్త్రౌజుమా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు,

కెనడా నుంచి మొదటి విడత యురేనియంను పొందిన భారతదేశం

Dec 7, 2015
భారతదేశం 4 డిసెంబర్ 2015 న కెనడా నుండి మొదటి విడతగా 2730 టన్నుల యురేనియం రవాణాసరుకును పొందింది. ఈ యురేనియం దేశంలోని అణు విద్యుత్ రియాక్టర్ల కోసం భారతదేశానికి సరఫరా చేయబడుతుంది.

విద్యుచ్చక్తితో పనిచేసే మొదటి విమానం ఆర్ఎక్స్ 1ఈ ఉత్పత్తికి చైనా అనుమతి

Dec 7, 2015
చైనా దేశీయ కార్యకలాపాలకు తయారుచేసిన విద్యుత్ శక్తితో ఆర్ఎక్స్1ఈ విమానం ఉత్పత్లికి చైనా విమానయాన పరిపాలన శాఖ 4 డిసెంబర్ 2015న అనుమతి మంజూరుచేసింది.

1930 త తర్వాత దీర్ఘకాలిక మాంద్యంలోకి ప్రవేశించిన బ్రెజిల్

Dec 4, 2015
బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్థ 2015 ఏప్రిల్ -జూన్ కాలంతో పోలిస్తే జులై- సెప్టెంబర్ 2015 సమయంలో 1.7 శాతం క్షీణించింది.ఈ విషయాన్ని 1 డిసెంబర్ 2015 న ప్రభుత్వం ప్రకటించింది.

ఇండియా-ఫ్రాన్స్ ల మధ్య అంతర్జాతీయ సౌర విద్యుత్ కూటమి

Dec 2, 2015
ఇండియా మరియు ఫ్రాన్స్ దేశాలమధ్య 30 నవంబర్ 2015న అంతర్జాతీయ సౌర విద్యుత్ కూటమి ఏర్పడింది. యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (కాప్ 21) సందర్భంగా భారత్ ప్రధాని నరేంద్రమోడీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ లు సంయుక్తంగా కూటమి ఏర్పాటుకు అవగాహన కుదిరింది.

బుర్కినా ఫాసో అధ్యక్షుడిగా రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరే ఎన్నిక

Dec 2, 2015
30 నవంబర్ 2015 న పశ్చిమ ఆఫ్రికన్ దేశం అయిన బుర్కినా ఫాసో అధ్యక్షుడిగా రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరే ఎన్నికయ్యారు.

పెద్ద ఎత్తున వాతావరణం మార్పుకోసం రూపాంతర కార్బన్ అసెట్ సౌకర్యం ప్రారంభం

Dec 1, 2015
నాలుగు యూరోపియన్ దేశాలైన జర్మనీ, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ లు 30 నవంబర్ 2015న లు రూపాంతర కార్బన్ అసెట్ సౌకర్యం (టిసిఎఎఫ్) ద్వారా వాతావరణంలో మార్పులు తీసుకురావాలని పారిస్ లో తీర్మానించాయి. ఈ కార్యక్రమం కోసం ఈ దేశాలకు ప్రపంచబ్యాంకు సాయం చేయనుంది.

మునిసిపల్ ఎన్నికల్లో మొదటిసారి పోటీ మరియు ఓటెసిన సౌదీ అరేబియా మహిళలు

Dec 1, 2015
మొట్టమొదటిసారిగా సౌదీఅరేబియాలో మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి మరియు పోటీచేయడానికి మహిళలకు అనుమతి ఇచ్చారు. 2011లో ఇచ్చిన రాయల్ డిక్రీ ప్రకారం అధికారులు 29నవంబర్ 2015న 284 మునిసిపల్ కౌన్సిళ్ళలో పోటీచేసేందుకు 979 మంది మహిళలను అనుమతించారు.

అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికలలో మారిషియో మక్రి గెలుపు

Nov 30, 2015
కన్జర్వేటివ్ ప్రతిపక్ష అభ్యర్థి మారిషియో మక్రి 2015 నవంబర్ నాలుగో వారంలో 51.5 శాతం ఓట్లతో అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందారు.

కౌలాలంపుర్ వద్ద జరిగిన 27వ ఆసియన్ శిఖరాగ్ర సదస్సు

Nov 26, 2015
27 వ సౌత్ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అసోసియేషన్ (ఆసియన్) శిఖరాగ్ర సదస్సు 21 నవంబర్ 2015 న మలేషియా లోని కౌలాలంపుర్ వద్ద జరిగింది. ఈ 2015 సదస్సు యొక్క థీమ్ మన ప్రజలు, మన కమ్యూనిటీ, మన దృష్టి.

మలేషియా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన విడుదల

Nov 26, 2015
మలేషియా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై మలేషియా ప్రధానమంత్రి మహ్మద్ నజీబ్ తున్ అబ్దుల్ రజాక్ మరియు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 23 నవంబర్ 2015న నరేంద్ర మోడీ మలేషియాలో అధికారిక పర్యటన సందర్భంగా సంయుక్త ప్రకటన విడుదలచేశారు.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...