1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. అంతర్జాతీయం | ప్రపంచం

అంతర్జాతీయం | ప్రపంచం

ఎనర్జీ మరియు సంస్కృతుల పరస్పర మార్పిడికి ఇండియా, ఇండోనేషియా ఒప్పందం

Nov 4, 2015
2 నవంబర్ 2015న, శక్తి మరియు సంస్కృతి మార్పిడి రంగాలను బలోపేతం చేసేందుకు భారతదేశం ఇండోనేషియా రెండు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలపై సంతకాలు, జకార్త లో భారత దేశ ఉపాధ్యక్షుడు హమీద్ అన్సారీ, ఇండోనేషియా ఉపాధ్యక్షుడు జుసఫ్ కల్లా సమక్షంలో జరిగాయి.

అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రతినిధుల సభ యొక్క 54వ స్పీకర్ గా ఎన్నికైన పాల్ ర్యాన్

Nov 2, 2015
రిపబ్లికన్ పాల్ ర్యాన్ 30 అక్టోబర్ 2015 న 236 ప్రతినిధుల సభ్యుల ఓట్ల ద్వారా సంయుక్త రాష్ట్రాల ప్రతినిధుల సభ యొక్క 54 వ స్పీకర్ గా ఎన్నికయ్యారు. కేవలం తొమ్మిదిమంది రిపబ్లికన్లు మాత్రమే ర్యాన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అతను ఒహియో కు చెందిన జాన్ బోయినేర్ స్థానంలో ఎన్నికయ్యారు.

నేపాల్ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన బిధ్యా దేవి భండారీ

Oct 29, 2015
బిధ్యా దేవి భండారీ 28 అక్టోబర్ 2015 న నేపాల్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

2015 పోలెండ్ పార్లమెంటు ఎన్నికల్లో లా అండ్ జస్టిస్ పార్టీ విజయం

Oct 28, 2015
కన్సర్వేటివ్ అనుబంధ పార్టీ లా అండ్ జస్టిస్ (పీఐఎస్) పార్టీ 25 అక్టోబర్ 2015న పోలెండ్ పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.

ప‌రీక్ష‌ల్లో కాపీ కొట్ట‌డం నేరంగా పరిగణించనున్న చైనా

Oct 28, 2015
చైనాలో క్రిమిన‌ల్ లా స‌వ‌ర‌ణ ప్ర‌కారం విద్యార్ధులఉ ప‌రీక్ష‌ల్లో కాపీ కొట్ట‌డానికి ప్ర‌య‌త్నం చేస్తే వారిని వెంట‌నే అరెస్టు చేసి ఏడేళ్ళ వ‌రకూ జైలు శిక్ష వేస్తారు.ఈ కొత్త చ‌ట్టం 1 న‌వంబ‌ర్ 2015 నుంచి అమ‌లులోకి వ‌స్తుంది.

హెచ్ఐవి బాధితుల యాంటీరిట్రోవైరల్ చికిత్స కోసం అన్ని పరిమితులను ఎత్తివేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Oct 26, 2015
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) 30 సెప్టెంబర్ 2015న హెచ్ ఐవీ బాధితులకు యాంటీ వైరల్ చికిత్స (ఎఆర్ టి) కోసం ఇప్పటివరకూ ఉన్న పరిమితులను, అర్హతలను అన్నింటినీ ఎత్తివేసింది

ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు ఉపయెగించే కీట్రుడా ఔషధానికి యుఎస్ఎఫ్డీఏ అనుమతి

Oct 26, 2015
అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డి ఏ) 2 అక్టోబర్ 2015న ఊపిరితిత్తుల క్యాన్సర్ (ఎన్ఎస్ సిఎల్ సి) చికిత్సకు ఉపయోగించే కీట్రుడా (పెంబ్రోలీజుమాబ్) ఔషధానికి అనుమతి ఇచ్చింది.

సిరియా గగనతలంలో పరస్పర వాయుసేనల మధ్య ఘర్షణల నివారణకు అమెరికా, రష్యా సైనిక దళాల ఒప్పందం

Oct 26, 2015
రష్యా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 20 అక్టోబర్ 2015న పరస్పర అంగీకార ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశాయి. దీని ప్రకారం సిరియాలో జరిగే సైనిక చర్యల్లో రెండు దేశాల వైమానిక దళాలు ఘర్షణకు దూరంగా ఉంటాయి.

2018 నాటికి ఆర్కిటిక్ లో శాశ్వత సైనిక స్థావరం స్థాపించనున్న రష్యా

Oct 26, 2015
రష్యా రక్షణ మంత్రి సెర్గీ ష్యోగు ఆర్కిటిక్ లో మరిన్ని సైనిక శిబిరాలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అలాగే సోవియట్ నాటి ఆరు స్థావరాలను తిరిగి నిర్మిస్తామని చెప్పారు.

అరబ్ వసంత విప్లవంపై నివేదికను విడుదల చేసిన ప్రపంచబ్యాంకు

Oct 23, 2015
ప్రపంచబ్యాంకు 21 అక్టోబర్ 2015న అరబ్ సమాజంలోని అసమానత, సందిగ్ధత, తిరుగుబాట్లు, అరబ్ దేశాల్లోని వివాదాలు, మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లోని (మీనా) ఆర్ధిక స్థితిగతులను వివరించే నివేదికను విడుదల చేసింది.

యూఎన్ఎస్సి యొక్క అశాశ్వత సభ్య దేశాలుగా ఎన్నికైన ఈజిప్ట్, జపాన్, సెనెగల్, ఉక్రెయిన్ మరియు ఉరుగ్వే

Oct 21, 2015
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జిఎ) 15 అక్టోబర్ 2015 న ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ (యూఎన్ఎస్సి) యొక్క అశాశ్వత సభ్య దేశాలుగా సేవలందించడానికి ఈజిప్ట్, జపాన్, సెనెగల్, ఉక్రెయిన్ మరియు ఉరుగ్వే దేశాలను ఎంపిక చేసింది.

కెనడా ప్రధానమంత్రిగా జస్టిన్ ట్రూడో ఎన్నిక

Oct 21, 2015
19 అక్టోబర్ 2015 న, 338 సీట్లు కలిగిన కెనడా యొక్క పార్లమెంట్ లో లిబరల్ పార్టీ 189 సీట్లు గెలవడంతో ఆ పార్టీ నాయకుడు జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

సెయింట్ థెరిసా ఎలియాస్ లిటిల్ ఫ్లవర్ తల్లిదండ్రులకు దైవత్వం ఆపాదించిన పోప్: ఆధునిక సమాజంలో మొదటి జంటగా గుర్తింపు

Oct 20, 2015
పోప్ ఫ్రాన్సిస్ 18 అక్టోబర్ 2015 సెయింట్ థెరిసా లిసియెక్స్ తల్లిదండ్రులైన లూయిస్ మరియు జెలీ మార్టిన్ లను సెయింట్ పీటర్స్ స్క్వేర్ వాటికన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దైవంగా ప్రకటించారు. ఆధునిక కాలంలో ఇలా ప్రకటించబడిన మొదటి జంటగా ప్రకటించారు.

అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక 2014 విడుదల

Oct 19, 2015
అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక 2014 ను యుఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ 14 అక్టోబర్ 2015న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మతస్వేచ్ఛ కోసం మానవ హక్కులు హరించిపోతున్నాయి.

అదాని గ్రూప్ కు కార్మిచాయెల్ బొగ్గు గని ప్రాజెక్టుని తిరిగి అప్పగించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

Oct 19, 2015
ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం15 అక్టోబర్ 2015 న ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిచాయెల్ బొగ్గు గని, రైల్ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అత పెద్ద ప్రాజెక్టులను అదానీ గ్రూప్ కు అప్పగించింది.

భారత్ లో పట్టణాభివృద్ధి పథకాలకు 30 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడికి మలేషియా ప్రతిపాదన

Oct 19, 2015
కన్ స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్ మెంట్ బోర్డ్ (సీఐడీబీ) మలేషియాకు చెందిన ప్రభుత్వ సంస్థ. 15 అక్టోబర్ 2015న భారతదేశంలో వివిధ గృహనిర్మాణ పథకాల్లో 30 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని సీఐడీబీ నిర్ణయించింది.

నలందా యూనివర్శిటీ స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్న మొదటి యూరోపియన్ దేశంగా పోర్చుగల్

Oct 16, 2015
పోర్చుగల్ 9 అక్టోబర్ 2015న నలందా విశ్వవిద్యాలయం, పరస్పర అంగీకార ఒప్పందం (ఎంవోయూ) పై సంతకం చేశాయి. ఈ ఎంవోయూ తో మొదటి యూరోపియన్ దేశంగా పోర్చుగల్ నిలిచింది.

5వ సారి బెలారస్ అధ్యక్ష ఎన్నికలు గెలిచిన అలెగ్జాండర్ లుకషేంకో

Oct 15, 2015
అలెగ్జాండర్ లుకషేంకో 11 అక్టోబర్ 2015 న 83.5 శాతం పైగా ఓట్లతో బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ గెలుపుతో దాదాపు 21 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా మాజీ సోవియట్ రిపబ్లిక్ పరిపాలించిన 61 ఏళ్ల లుకషేంకో ఐదవ సారి అధికారంలోకి వచ్చారు.

భారత్-మాల్దీవులు జాయింట్ కమిషన్ యొక్క 5వ సమావేశం మాల్దీవులలో నిర్వహణ

Oct 14, 2015
11 అక్టోబర్ 2015న మాల్దీవులు లో జరిగిన భారతదేశం - మాల్దీవులు జాయింట్ కమిషన్ 5 వ సమావేశం మాల్దీవులు రాజధాని మాలెలో జరిగిందిరెండు దేశాల విదేశాంగ మంత్రులు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ముఖ్యంగా ఆర్థిక, రక్షణ, పరిపాలన, మరియు సాంస్కృతిక అంశాలపై చర్చలు జరిపారు.

అక్రమవ్యాపారులతో పోరాడేందుకు మధ్యధరా సముద్రంలో ఆపరేషన్ సోఫియా రెండోదశను ప్రారంభించిన యూరోపియన్ యూనియన్

Oct 12, 2015
ఆపరేషన్ సోఫియా: మధ్యధరా సముద్రంలో మానవుల అక్రమరవాణా, స్మగ్లర్లను అరికట్టడానికి యూరోపియన్ యూనియన్ ఆపరేషన్ సోఫియా పేరుతో నౌకాయాన చర్యను ప్రారంభించింది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...