Search

హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టాకు ది మోస్ట్ పాపులర్ ఆల్ టైమ్ ఇంటర్నేషనల్ స్టార్ ఇన్ ఇండియా అవార్డు

ప్రముఖ హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టా ది మోస్ట్ పాపులర్ ఆల్ టైమ్ ఇంటర్నేషనల్ స్టార్ ఇన్ ఇండియా అవార్డును పొందారు.

Apr 30, 2014 12:10 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ప్రముఖ హాలీవుడ్ నటుడు జాన్ ట్రవోల్టా, ది మోస్ట్ పాపులర్ ఆల్ టైమ్ ఇంటర్నేషనల్ స్టార్ ఇన్ ఇండియా అవార్డును పొందారు. ఈ ప్రత్యేక సత్కారాన్ని 15వ ఐఫా అవార్డుల కార్యక్రమంలో బహుకరించారు. ఈ ఐఫా అవార్డుల ప్రధాన కార్యక్రమం ఫ్లోరిడాలోని తంపా బేలో ఏప్రిల్ 23, 2014 నుంచి ఏప్రిల్ 26, 2014 వరకు జరిగింది.

న్యూజెర్సీ (అమెరికా) కి చెందిన ట్రవోల్టా, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధిగాంచిన నటుడు, గాయకుడు మరియు డాన్సర్. ఆయన సాటర్డే నైట్ ఫీవర్, పల్ప్ ఫిక్షన్, గ్రీస్, స్వార్డ్ఫిష్, ఫేస్ ఆఫ్, బ్రోకెన్ యారో మరియు ల్యాడర్ 49 వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆయన రెండుసార్లు ఆస్కార్ అవార్డు, ఏడుసార్లు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లను పొందారు. ట్రవోల్టా రెండుసార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ఆయన తొలిసారిగా గెట్ శార్టి అనే చిత్రానికిగాను, మరోసారి వరల్డ్ ఫిల్మ్ ఫేవరేట్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు.

ఐఫా అవార్డులు

ఐఫా అవార్డులను ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తుంది. ఈ అవార్డులను బాలీవుడ్ లోని నటులు (ఆర్టిస్టులు) మరియు సాంకేతిక నిపుణుల కృషికి గుర్తింపుగా అందజేస్తారు.
 
2013 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల కార్యక్రమం జూన్, 2013లో మకావ్ (చైనా) లో జరిగింది. ఈ అవార్డులను తొలిసారి 2000లో లండన్ లో ప్రదానం చేశారు. ఈ అవార్డులలో పాపులర్ అవార్డు, టెక్నికల్ అవార్డులు, మరియు ప్రత్యేక అవార్డుల విభాగాలు ఉంటాయి.

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS