Search

మలేషియా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త ప్రకటన విడుదల

మలేషియా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై మలేషియా ప్రధానమంత్రి మహ్మద్ నజీబ్ తున్ అబ్దుల్ రజాక్ మరియు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 23 నవంబర్ 2015న నరేంద్ర మోడీ మలేషియాలో అధికారిక పర్యటన సందర్భంగా సంయుక్త ప్రకటన విడుదలచేశారు.

Nov 26, 2015 14:12 IST
facebook IconTwitter IconWhatsapp Icon

మలేషియా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై మలేషియా ప్రధానమంత్రి మహ్మద్ నజీబ్ తున్ అబ్దుల్ రజాక్ మరియు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 23 నవంబర్ 2015న నరేంద్ర మోడీ మలేషియాలో అధికారిక పర్యటన సందర్భంగా సంయుక్త ప్రకటన విడుదలచేశారు.

అక్టోబర్ 2010 నుంచి ఇరుదేశాలకు చెందిన మంత్రులు, అధికారుల స్థాయి లో జరిగిన చర్చల వల్ల రెండుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం జరిగింది.

భారత్ మలేషియా దేశాల నాయకులు ఆర్ధిక అభివృద్ధి, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో సుస్థిరత, దేశాల మధ్య వృద్ధి రేటు పెంచుకోవడంపై ఆసక్తి చూపారు. ఇరుదేశాల ప్రధాన మంత్రులు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం 2015-2020 ఒప్పందంపై సంతకాలు చేశారు.

రెండుదేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందింపచేసుకోవాలని నిర్ణయానికి వచ్చాయి.

రాజకీయ సంప్రదింపులు

• బహుపాక్షిక అంశాల్లో నెలకొన్న తేడాలను తగ్గించుకునేందుకు తరచుగా సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయానికి వచ్చాయి.

• రెండుదేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీలో 2016లో తదుపరి సమావేశం నిర్వహించుకోవాలని నిర్ణయించాయి.

• వాణిజ్యం, పరిశ్రమలు, రవాణా, ప్రజాపనులు మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇరుదేశాల కేబినెట్ మంత్రులు తరచుగా సమావేశం కావాలని నిర్ణయించారు.

• ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన రెండుదేశాల మధ్య అమలవుతున్న వివిధ అంశాల ప్రగతిని ఎప్పటికప్పుడు విదేశాంగస్థాయి అధికారులు, సీనియర్ అధికారులు సమీక్షిస్తారు.

• రెండుదేశాల మధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరియు పరస్పర సహకారం పెంపొందాలని పునరుద్ఘాటించాయి.

ఆర్ధిక, వాణిజ్య మరియు ఆర్ధిక ప్రాంతాలు

• రెండుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడుల సహకారం వంటి అంశాల్లో ఆర్ధిక పరమయిన అంశాలను పటిష్టం చేసుకోవాలని పునరుద్ఘాటించాయి.

• రెండుదేశాల వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రులు తరచుగా సమావేశం కావాలని నిర్ణయించారు.

• రెండుదేశాల మధ్య మౌలిక వసతులు, నిర్మాణం రంగం లో పరస్పర సహకారం, రెండుదేశాల కంపెనీలు సంయుక్తంగా నిర్మాణాలు చేపట్టే అంశాలను పరిశీలించారు.
•ప్రతిపాదిత రంగాలకు సంబంధించి భారత్ మలేషియా దేశాల సీఈవోలు సమావేశం కావాలని, వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలని భావిస్తున్నాయి.

• మలేషియాలోని సైబర్ జయాలో భారతీయ ఐటీ కంపెనీల పెట్టుబడులను ఆహ్వానించేందుకు ముందుకువచ్చింది.

రక్షణ మరియు భద్రత

• రెండుదేశాల రక్షణ మంత్రులు, సీనియర్ అధికారులు, రక్షణ శాఖల అధిపతులు తరచూ సమావేశమై రక్షణ రంగంలో మార్పిడి విస్తరించుకోవాలని నిర్ణయించాయి.  

• తదుపరి ఇండియా మలేషియా రక్షణ సహకార సమావేశం రక్సణ శాఖ కార్యదర్శి/సెక్రటరీ జనరల్ స్థాయిల మధ్య జరపాలని నిర్ణయించాయి.

•హరిమాయి శక్తి లాంటి ఇరుదేశాల సైనిక కవాతు లను ఆహ్వానించాలని, కంపెనీల స్థాయిలో వాటిని నిర్వహించాలని నిర్ణయానికి వచ్చాయి.

• ఎస్ యూ-30 ఫోరం ద్వారా శిక్షణ రంగంలో సహకారం, నిర్వహణ, సాంకేతిక సహకారం మరియు భద్రతా సంబంధమయిన అంశాలు, భారతీయ పైలెట్లకు ఎస్ యు 30 ఎంకెఎం పై మలేషియాలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాయి.

•ఇండియన్ కోస్ట్ గార్డులు మరియు మలేషియన్ మారిటైం ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల మధ్య వార్షిక సమావేశాలు నిర్వహించడం, అలాగే ఆసియాన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీల సమావేశం (హెచ్ఏసీజీఎఎం) లలో పాల్గొనాలని నిర్ణయించాయి.

• మానవతా సహకారం మరియు విపత్తు ఉపశమనం (హెచ్ఏడీఆర్) లలో వైట్ షిప్పింగ్ ద్వారా రెండుదేశాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని అంగీకరించాయి.
• సెంటర్ ఫర్ యుఎన్ పీస్ కీపింగ్ ఆఫ్ ఇండియా (సీయుఎన్ పికె) మరియు మలేషియన్ పీస్ కీపింగ్ సెంటర్ (ఎంపిసి) లమధ్య అనుసంధానం పెంచాలని నిర్ణయించాయి.

• శిక్ష పడ్డ ఖైదీల మార్పిడి కి సంబంధించి రెండుదేశాలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి.

పర్యాటకం మరియు విద్య

• మలేషియాలో నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2015 విజయంపై చర్చ జరిగింది.

•భారత్ మరియు మలేషియా దేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాలు మరియు విద్యాసంస్థలు ఇచ్చే డిగ్రీలను రెండుదేశాలు అంగీకరించాలని ఎంవోయూ కుదిరింది.

•ఇండియన్ స్కాలర్ షిప్ ఫండ్ ను మరో 50 మిలియన్ రూపాయలకు పెంచేందుకు భారత్ అంగీకరించింది. ఈ మొత్తాన్ని కౌలాలంపూర్ లోని భారత హై కమిషనర్ పర్యవేక్షిస్తారు.

• కౌలాలంపూర్ లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ కల్చరల్ సెంటర్ గా మార్చేందుకు అంగీకరించారు.

ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సహకారం

• ఏషియాన్ మరియు ఇండియా నూతన కార్యాచరణ ప్రణాళిక (2016-2020) ప్రకారం ఏషియాన్- ఇండియా దేశాల మధ్య శాంతి, ప్రగతి మరియు శ్రేయస్సులో భాగస్వామ్యం.

•27వ ఆసియా శిఖరాగ్ర సమావేశం మరియు సంబంధిత శిఖరాగ్య సమావేశాలు విజయవంతంగా నిర్వహించడం, 10 వ వార్షికోత్సవం సంస్మరణ సందర్భంగా నవంబర్ 2015లో ఈస్ట్ ఆసియా శిఖరాగ్రసమావేశాన్ని రెండుదేశాలు ఆహ్వానించాయి.

• 2015 కౌలాలంపూర్ తీర్మానాన్ని ఆహ్వానించాయి. అలాగే ఆసియాన్ దేశాల మధ్య మరియు కౌలాలంపూర్ తీర్మానం: ఆసియాన్ 2025: కలిసిముందుకు సాగుదాం వంటి అంశాలను రెండుదేశాలు ఆహ్వానించాయి.

•2030 నాటికి పేదరిక నిర్మూలనకు సంబంధించి లక్ష్యాలను, 2015 తర్వాత అభివృద్ధి లక్ష్యాలను ఆహ్వానించారు.

ఇవేకాకుండా వివిధ రంగాలకు సంబంధించి రెండుదేశాలు మానవ వనరులు, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతిక రంగం, ప్రజా పాలన వంటి వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS